సివిల్స్ 2017 మెయిన్స్ ఫ‌లితాలు విడుద‌ల‌

U P S C
U P S C

దిల్లీ: సివిల్స్‌-2017 మెయిన్స్‌ ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, తదితర కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు (గ్రూప్‌-ఏ, గ్రూప్‌-బి) సంబంధించి ఉద్యోగుల ఎంపిక కోసం గతేడాది అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 3 వరకు ఈ పరీక్షలను యూపీఎస్సీ  నిర్వహించింది. ఎంపికైన అభ్యర్థులు సంబంధిత పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 19 నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి.