సిలికాన్ స్టేట్‌లో రాహుల్ ప్ర‌చారం

raahul
raahul

బెంగుళూరుః కర్ణాటక శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏప్రిల్ లేదా మే నెలలో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. నేటి నుంచి కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ తొలిసారిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బళ్లారి నుంచి ప్రారంభం కానున్న ఈ ఎన్నికల ప్రచారం.. ఈ నెల 13 వరకు 6 జిల్లాల్లో కొనసాగనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డుషోలు, బహిరంగ సభలు, దేవాలయాల సందర్శన, ప్రారంభోత్సవాలు ఉండనున్నాయి. ఇందుకు సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్నది. కర్ణాటక శాసనసభ ఎన్నికలు 2019 సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్నారు.