సిలబస్‌లో మార్పులు అవసరం:

ప్రజావాక్కు

SYLLUBS
SYLLUBS

సిలబస్‌లో మార్పులు అవసరం: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో ఏకోన్ముఖ లక్ష్యంతో పనిచేస్తే ప్రాథమిక విద్య మెరుగుపడి తద్వారా విజ్ఞాన సముపార్జ నకు, బలమైన వ్యక్తిత్వ వికాసానికి విద్యార్థులలో బీజం పడు తుంది. ఉపాధ్యాయుల సంక్షేమంకోసం రెండు తెలుగు రాష్ట్రా ల ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయడం హర్షనీయం. త్వ రలోనే టెట్‌ పరీక్ష ద్వారా నాణ్యమైన రీతిలో వేలాది బోధనా సిబ్బందిని నియమించేందుకు అప్పుడే ప్రక్రియ ప్రారంభ మైంది. మండలానికి ఒకటి చొప్పున ఆదర్శపాఠశాలల నిర్మా ణం శరవేగంతో సాగుతోంది. విద్య అనేది చదవడం, రాయ డం, మార్కులను సాధించడానికే పరిమితం చేయకుండా జాతీ య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసేలా రెండు ప్రభుత్వాలు సిలబస్‌లో మార్పులు చేయాలి.

మంచినీటి కొరత:-జి.అశోక్‌, గోదూర్‌, జగిత్యాలజిల్లా

మనిషి మనుగడకు నీరు ఎంత ముఖ్యమో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి వ్యక్తి రోజుకు ఆరు లీటర్ల పరిశుభ్రమైన మంచి నీళ్లు తాగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏనాడో తెలియచేసిం ది. కానీ డబ్ల్యుహెచ్‌ఒ అభిప్రాయం ప్రకారం మొత్తం వ్యాధు ల్లో 88శాతం వ్యాధులు కలుషితనీటి వల్లనే కలుగుతున్నాయి. అయితే మండుటెండలు ముదరక ముందే, వేసవి కాలం ఆరం భంలోనే రాష్ట్రంలోమంచి నీటికి కటకట ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. తాగునీటి సమస్య పట్ల ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శించడం క్షంతవ్యం కాదు. ఏటికేడు భూగర్భజలాలు అడుగంటడం వల్ల బావులు, బోర్లు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ముఖ్యంగా ఈసారి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మంచినీటి కొరత చాలా ఎక్కువగా ఉంది.
నిబంధనలు బేఖాతరు:-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
నిబంధనలు పాటించని ప్రైవేట్‌ వాహనాల మూలంగా నిత్యం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పరిమి తికి మించిన జనాన్ని కుక్కించడం, అతివేగం, నిర్లక్ష్యంగా ఓవర్‌టేక్‌ చేయడం, నిర్లక్ష్యంగా రోడ్డు దాటించడం, సెల్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి.డ్రైవర్ల అత్యాశకు అమాయ కులు బలవ్ఞతున్నారు. అధికారులు నిత్యం అప్రమత్తంగా వ్యవహరించి ప్రైవేట్‌వాహనాల దూకుడుకుకళ్లెం వేయాలి.

బాలిక విద్యపై నిర్లక్ష్యం:-ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరుజిల్లా

బాలిక విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వేల కోట్ల ఖర్చుతో పలు పథకాలు అమలు చేస్తున్నా అవి అధి కారుల నిర్లక్ష్యం,పర్యవేక్షణా లోపం కారణంగా నీరు కారిపోతు న్నాయి.గతంలో అన్ని పాఠశాలలో సురక్షితమంచినీరు, టాయి లెట్ల నిర్మాణం, ఫర్నిచర్‌ కోసం ప్రభుత్వం ఒక సమగ్ర కార్యా చరణ రూపొందించి నిధులు కూడా విడుదల చేసింది. అయితే తాజా సర్వే ప్రకారం గుంటూరుతో సహా పలు జిల్లాల్లో 10 శాతం కూడా పనులు పూర్తికాలేదు. బిల్లుల చెల్లింపులో జాప్యం పేరిట కాంట్రాక్టర్లు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. అలాగే గత విద్యాసంవత్సరంలో ఎనిమిది, తొమ్మిది తరగతి బాలికల కోసం సైకిళ్లు ఉచితంగా అందచేసేందుకు ప్రభుత్వం బడికొస్తా పథకం ప్రారంభించి సైకిల్‌కు నాలుగువేల రూపాయల చొప్పు న నిధులు విడుదల చేయగా విద్యాసంవత్సరం ముగిసినా ఇరవైశాతం పంపిణీ కూడా పూర్తికాలేదు.

డైరెక్టర్ల నియామకం అవసరం: -గుండమల్ల సతీష్‌కుమార్‌, నారాయణపురం
రాష్ట్రంలో నాలుగేళ్ల కిందట ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌ను నియమించింది. ఛైర్మన్‌ పదవీకాలం మూడు సంవ త్సరాలు.ఒకసారి పదవి పూర్తిచేసుకొని తర్వాత మళ్లీ మూడేళ్ల పాటు ఛైర్మన్‌ పదవిని పొడిగించింది. కానీ డైరెక్టర్‌ నియామకం చేపట్టలేదు.రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది. వాటన్నింటిని క్షేత్రస్థాయి లబ్ధిదారులకు చేరుతున్నాయా లేదా ఎస్సీ సామాజిక వర్గాలకు ఇంకా కావాల్సిన సౌకర్యాలు ఏమిటని పరిశీలించి ప్రభుత్వానికి వివరించాల్సిన డైరెక్టర్లు లేనప్పుడు ఇవన్నీ సాధ్యం కావ్ఞ. కావ్ఞన ఎస్సీ కార్పొరేషన్‌ కమిటీలో డైరెక్టర్లను నియమించాలి.

ఆటో ప్రమాదాలకు అంతం లేదా?:-కామిడి సతీష్‌కుమార్‌, జడలపేట, భూపాలపల్లిజిల్లా
నిజామాబాద్‌ జిల్లాలో మెండోర మండల కేంద్ర శివారులో ఆటో బావిలోకి దూసుకెళ్లిన సంఘటనలో 11మంది మృతిచెం దారు. అనుభవం లేని ఆటోడ్రైవర్‌, పరిమితికి మించి ప్రయాణి కులను ఎక్కించుకోవడం, మితిమీరిన వేగంతో ప్రయాణించి రోడ్డుపైనున్న గుంతను తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి పక్కనే ఉన్న బావిలోకిపడిపోయింది.రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిలా ్ల్లలో ఆటో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ముఖ్యంగా సెవెన్‌ సీటర్‌ ఆటోలలో పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కి స్తున్నారు.డ్రైవింగ్‌ లైసెన్సులేకున్