సియోల్ ఆసుప‌త్రిలో ఘోర అగ్ని ప్ర‌మాదం

fire accident in seuoel
fire accident in seuoel

సియోల్ః దక్షిణకొరియా రాజధాని సియోల్‌లోని సెజాంగ్‌ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 33 మంది ప్రాణాలుకోల్పోగా, మరో 80 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆసుపత్రి ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి. ఆసుపత్రిలోని మొదటి, రెండవ అంతస్తుల్లో ఉన్న వారే బాధితుల్లో అధికమంది ఉన్నారని అక్కడి అధికారులు చెప్పారు. గాయాలపాలయిన వారిని రెస్క్యూ సిబ్బంది మరో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆ ఆసుపత్రిలో సుమారు 200 మంది ఉన్నారని అక్కడి అధికారులు చెప్పారు. అగ్ని ప్రమాదం జరుగుతోందని అరుస్తూ, ఓ నర్సు అందరినీ అలెర్ట్ చేయడంతో కొంతమంది అత్యవసర ద్వారాల ద్వారా బయటకు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు