సిమెంట్‌ రంగంపై నోట్లరద్దు ఒత్తిడి

CEMENT
CEMENT

సిమెంట్‌ రంగంపై నోట్లరద్దు ఒత్తిడి

ముంబై, జనవరి 3: పెద్దనోట్ల రద్దుకారణంగా సిమెంట్‌ రంగ వృద్ధి నాలుగుశాతం దిగజారింది. రుణభారం పై మరింతప్రభావం, ఒత్తిడి పెరిగింది. సిమెంట్‌ ఉత్పత్తి 2016-17 సంవత్సరంలో నాలుగుశాతం తగ్గింది. అంతకుముందు 4-6శాతంగా ఉన్న అంచనాల నుంచి నాలుగుశాతం వృద్ధి ఉంటుందని ఇండ్‌రా రేటింగ్స్‌ వెల్లడించింది. సంస్థ తాజాగా వెలువరించిన నల్లధనానికి చీకటిరోజులు అన్న శీర్షికన వెలువరించిన నివేదికలో పెద్దనోట్ల రద్దు ప్రభావం స్వల్పకాలికంగా ఈ రంగంపై ఎక్కువ పడుతుందని అంచనా. 216-17లో సిమెంట్‌ ఉత్పత్తి నాలుగుశాతం పెరుగుతుందని ఇండియారేటింగ్స్‌ అంచనా వేసింది. నవంబరు, డిసెంబరు నెలల్లోనే ఉత్ప త్తి తగ్గిందని అంచనావేసింది. ఏప్రిల్‌నుంచి నవంబరు మధ్యకాలంలో 4.3శాతం వృద్ధి ఉందని, నవంబరునెలలో మాత్రం స్వల్పంగా 0.5శాతం మాత్రమే వృద్ధిని నమోదుచేసిందని తేలింది. చిన్న, మధ్యతరహా సిమెంట్‌ కంపెనీ లు ఈ రెండుత్రైమాసికాల్లో తీవ్రఒత్తిడికి లోనవు తాయని, వాటి రుణభారం కూడా మరింత పెరుగుతుందని ఇండ్‌రా అంచనావేసింది. రియల్‌ఎస్టేట్‌ రంగం నోట్లరద్దు వత్తిడికి లోనవ డం వల్ల ఈ ప్రభావం సిమెంట్‌రంగంపూ చూపించింది. సిమెంట్‌, ఉక్కు రంగాలపై ప్రతికూల ప్రభావం చూపింది. నవంబరు డిసెంబరునెలల్లో పెద్దనోట్లరద్దుతో దేశవ్యాప్తంగా సిమెంట్‌ అమ్మకాలు 20-25 శాతం తగ్గాయిన అంచనా. దేశవ్యాప్తంగాచూస్తే ప్రతి బస్తాకు 15-20 రూపాయలమేర తగ్గింది. సిమెంట్‌రంగానికి అత్యంతకీలకమైన ముడివనరు పెట్‌కోక్‌ టన్నుకు 60-70 రూపాయలకు పెరిగింది. అంతకుముందు 40 డాలర్లు మాత్రమే ఉన్న వీటిధరలు భారీగాపెరగడం కూడా సిమెంట్‌రంగానికి భారం అయింది. వ్యక్తిగత ఇళ్ల నిర్మాణదారులు రుతుపవనాలు మంచిగా ఉంటున్నందున గ్రామీణప్రాం తాల్లో వృద్ధి ఉంటుందని అంచనావేస్తే పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు అందుబాటులోకి రాగలిగితే బిల్డర్లు కొంతమేర కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ విశ్లేషించింది.