సిబిఐ విచారణలో ఆర్బీఐ అధికారి

న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో 13,500 కోట్ల మోసపూరిత లావాదేవీలకు పాల్పడిన నీరవ్ మోడీ, మోహుల్ ఛోక్సీ కేసులో సంబంధం ఉందన్న ఆరోపణపై ఆర్బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్ హరుణ్ రషీద్ ఖాన్‌ను శుక్రవారం కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) విచారించింది. 2011-16 మధ్య కాలంలో ఆయనను ఆర్‌బిఐకు డిప్యూటీ గవర్నర్‌గా వ్యవహారించారు. ఇందులో మోసం జరుగుతున్నట్లు స్విఫ్ట్ సందేశాలను పంపినప్పటికీ ఆయన మోసాన్ని గుర్తించలేకపోవడంతో ఆయన వైఫల్యాన్ని గురించి, ఆడిటింగ్ లోపాల గురించి ప్రశ్నిస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు మూడు రోజుల ముందు ఆర్థికమంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన 20:80 బంగారు దిగుమతులపైనా ఆయనను ప్రశ్నించిందని రషీద్ ఖాన్ సన్నిహితులు తెలిపారు. ఇంతకు ముందు ముఖ్యమైన జనరల్ మేనేజర్స్ పాటు మరొక జనరల్ మేనేజర్‌తో సహా మొత్తం నలుగురిని గురువారం సిబిఐ ప్రశ్నించింది.