సిబిఐ నాగేశ్వర్‌కు అదనపు డైరెక్టర్‌ హోదా!

nageswararao
nageswararao

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తుసంస్థ సిబిఐలో నియమితులయిన తాత్కాలిక డైరెక్టర్‌ నాగేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం అదనపు డైరెక్టర్‌ హోదా పదోన్నతి కల్పించింది. 2016లో ఆయన్ను అదనపు డైరెక్టర్‌ హోదాకు ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకోలేదు. ఆయన బ్యాచ్‌పై ప్రభుత్వం సమీక్షచేసింది. 2018 ఏప్రిల్‌లో సమీక్షించింది. రావు సిబిఐలో జాయింట్‌డైరెక్టర్‌గా 2016లో చేరారు. 1986 బ్యాచ్‌ ఐపిఎస్‌ అధికారి అయిన రావు ఒడిశా కేడర్‌కు చెందినవారు. ఆయన పేరును కేంద్ర నియామకాల కేబినెట్‌కమిటీ క్లియర్‌చేసింది. గత అక్టోబరు 24వ తేదీ అర్ధరాత్రి సిబిఐకి తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రావుకు ప్రస్తుతం ప్రభుత్వం అదనపు డైరెక్టర్‌ హోదాను ఖరారుచేసింది. అయితే సిబిఐ డైరెక్టర్‌, ప్రత్యేక డైరెక్టర్ల వివాదంలో నియమితులయిన రావును ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోవద్దని, నిర్ణయాలపై కోర్టుకు వివరించాలని సుప్రీం ఆదేశించింది. అయితే బాధ్యతలు స్వీకరించినవెంటనే రావు 12కుపైగా బదిలీ ఉత్తర్వులపై సంతకాలుచేసారు. ప్రత్యేకించి ఎవరైతే అధికారులు ఆస్తానాపై దర్యాప్తుచేస్తున్నారో వారందరినీ బదిలీచేసారు. అంతేకాకుండా సిబిఐ డైరెక్టర్‌ కార్యాలయాన్ని తనిఖీచేసి స్వాధీనంచేసుకునేందుకుసైతం ఉత్తర్వులపై సంతకాలుచేయడం సిబిఐ డైరెక్టర్‌ అలోక్‌కుమార్‌వర్మకు ఆగ్రహం కలిగించింది. అందుకే ఆయన సుప్రీంను ఆశ్రయించారు.