సిబిఐ కార్యాలయం వద్ద రాహుల్‌ నిరసన

RAHUL GANDHI
RAHUL GANDHI

న్యూఢిల్లీ: సిబిఐ డైరెక్టర్‌ అలోక్‌వర్మ సెలవుపై పంపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నేడు దేశవ్యాప్తంగా నిరసనకు దిగింది. దేశంలోని అన్ని సిబిఐ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఆందోళణ చేపట్టారు. ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ఆందోళనలో పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఆనంద్‌ శర్మ , వీరప్ప మొయిల, సిపిఐ నాయకులు రాజా, శరద్‌ పవార్‌ తదితరులు ఈ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. రాహుల్‌ నిరసన కార్యక్రమానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది.