సిబిఐకి జర్నలిస్టుల హత్య కేసు

CBI
CBI

అగర్తలా: గత ఏడాది హత్యకు గురైన జర్నలిస్టుల హత్య కేసులను కేంద్ర దర్యాప్తుసంస్థ(సిబిఐ) విచారణ చేపట్టనుందని ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌ శుక్రవారం పేర్కొన్నారు. గత సెప్టెంబర్‌లో జర్నలిస్టు శాంతన్‌ భౌమిక్‌, నవంబర్‌లో సుదీప్‌ దత్తా భౌమిక్‌ హత్యలు జరగ్గా, ఈ కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ఐతే ఇప్పటివరకు త్రిపుర పోలీస్‌ ప్రత్యేక విచారణ బృందం సుధీప్‌ దత్తా భౌమిక్‌ కేసులో మాత్రమే అభియోగ పత్రాలు దాఖలు చేసింది. శాంతన్‌ బౌమిక్‌ కేసులో అభియోగ పత్రాలుదాఖలు చేయలేదు. కాగా, త్రిపురలో జర్నలిస్టుల యూనియన్‌ బాధిత కుటుంబ సభ్యులు ఈ కేసును విచారణకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఈ కేసును సిబిఐకి అప్పగించనుంది. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు చేపడుతున్నందుకు రిలీఫ్‌గా ఉందని సీఎం అన్నారు.