సిపిఎస్‌ రద్దుకోసం ఉద్యోగుల ఉద్యమం

Govt. Employees Rally
Govt. Employees Rally

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సిపిఎస్‌) రద్దు చేయాలని పాత పెన్షన్‌ స్కీంను పునరుద్ధ్ధరించాలని కోరుతూ గత కొంత కాలంగా వివిధ రూపాలలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ వస్తు న్నారు.

దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్‌ స్ట్రీట్‌వద్ద గత మార్చి నెలలో పార్లమెంట్‌సమావేశాల సందర్భంగా వేలాది మంది కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు సామూహికంగా నిరసన ధర్నాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో2015,2016 సంవత్సరాలలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యా య సంఘాలు, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులు నూతన పెన్షన్‌ రద్దు చేస్తూ పాత పెన్షన్‌ విధానాన్ని అమలు పర్చాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలో కలెక్టరేట్‌ల వద్ద రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ ఆఫీ సుల వద్ద ధర్నాలు చేపట్టారు. టీజిఓ ఆధ్వరంలో హైదరాబాద్‌ ఆగస్టు 31న అన్ని జిల్లా డివిజన్‌లలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్‌రంగంలో పనిచేసే కార్మికులు పదవీ విరమణ చేసిన తర్వాతవారికి జీవనోపాధి కల్పించవలసిన బాధ్యత సమాజంపై ఉన్నది.ఈసామాజిక భద్రతలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 1952లో పెన్షన్‌ సౌకర్యాన్ని కల్పించింది.

ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆ ఉద్యోగి చివరి నెలలో పొందు తున్న మూలవేతనం+కరువ్ఞ భత్యంలో 50 శాతం పెన్షన్‌గా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్నది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విధం గా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్‌ చెల్లి స్తున్నాయి. ఒకవేళ ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబానికి కూడా పెన్షన్‌చెల్లించే చట్టబద్ధ విధానంఅమలులో ఉన్నది. పెన్షన్‌దారులకు కూడా వేతన సవరణలను వర్తింపచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు వృద్ధా ప్యంలో ఎటువంటి చీకుచింతా లేకుండా ప్రశాంత జీవనం గడిపే విధంగా దేశంలో పెన్షన్‌ చట్టాలు అమల్లో ఉన్నాయి.దేశంలో నూత న ఆర్థిక విధానాలు అమలు ప్రారంభమైన 1991తర్వాత ప్రపంచ బ్యాంక్‌ నుండిఅంతర్జాతీయ సంస్థల నుండి, బహుళజాతి సంస్థల నుండి, భారత పారిశ్రామిక వాణిజ్యవర్గాల నుండి వస్తున్న ఒత్తిళ్ల మేరకు ప్రభుత్వం పెన్షన్‌ ఖర్చులు తగ్గించుకోవాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. పలుకుబడి కలిగిన ఆ వర్గాలు భారతదేశం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కరెంట్‌ ఖాతా లోటు తగ్గించుకో వాలి.కనుక పెన్షన్‌ రంగంలో సంస్కరణలు చేపట్ట వల్సిందేనని భారత ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ వచ్చాయి. దేశంలో ప్రభుత్వ ఉద్యోగ వర్గానికి మాత్రమేపెన్షన్‌ సదుపాయాలు ఉన్నాయి.మిగిలిన ప్రజలకు కూడా వృద్ధాప్యంలో భద్రత కల్పించాల్సిన అవసరం ఉందంటూ దాని కోసం 2000 సంవత్స రం ఎస్‌.ఏ.యం, ఆధ్య ర్యంలో వృద్ధాప్య సాంఘిక ఆర్థిక భద్రత నివేదిక (ఓల్డేజ్‌ సోషల్‌ అండ్‌ ఇన్‌కమ్‌ రిపోర్టు) ఒకటి రూపొం దించారు. అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్‌ సదుపాయం కల్పించాలని ఆ నివేదికలో ప్రభుత్వానికి సూచించారు.

రకరకాల సబ్సిడీల రూపంలోను పొందుతున్న భారత పెట్టుబడి దారివర్గం ఉద్యోగులకు జీవన భద్రత కల్పించే పెన్షన్‌కు అయ్యే ఖర్చును తగ్గించుకోవాలని పట్టుబడుతూ వచ్చాయి. పెట్టుబడిదారి వర్గాల ప్రయోజనాలకు పెద్దపీటవేసే పాలకులు దశాబ్దా లుగా అమలువ్ఞతున్న పెన్షన్‌ విధానం (డిఫైన్డ్‌ బెన్‌ఫిట్‌ సిస్టం) స్థానంలో ఉద్యోగులు తమ జీతంనుండి పెన్షన్‌ చెల్లించే విధానం కంట్రిబ్యూట రీ పెన్షన్‌ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం నోట్‌ఎఫ్‌ నెం. 5/7/2003 ఈసిబి అండ్‌ పిఆర్‌ తేది.10.10.2003 ద్వారా అమలులోనికి తీసుకొచ్చారు. 01.01.2004 నుండి అమల్లోనికి వచ్చిన ఈ విధా నానికి నూతన పెన్షన్‌ పథకం అని పేరు పెట్టారు. ఈ విధానాన్ని ఆర్థిక భాషలో డిఫైన్డ్‌ కంట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ అంటారు. ఈ నూత న పెన్షన్‌ విధానాన్ని అమలు చేయడానికి ఉద్దేశించిన పెన్షన్‌నిధి నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌) బిల్లు 01.01.2004 నుండి పార్లమెంటులో పెట్టి అమలుకు ఆనాడు ఎన్డీయే ఆ తర్వాత యుపి ఏ ప్రభుత్వాలు భట్టివిక్రమార్కునిలాగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. యుపిఏ- 1లో ప్రధాన భాగస్వాములైన లెఫ్ట్‌ పార్టీలు వ్యతిరేకిస్తూ రావడంతో 2009 వరకు సాధ్యంకాలేదు. ఆ తర్వాత వచ్చిన యుపిఏ-2 ప్రభుత్వం 2011లో తిరిగి పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టా రు.

బిల్లును స్టాండింగ్‌ కమిటీకి 2005లోను, 2011లోను రెండు సార్లు సిఫార్సు చేశారు. స్టాండింగ్‌ కమిటీ సిఫార్సుల మేరకు 2013సెప్టెంబర్‌లో లోక్‌సభలో ప్రవేశపెడుతున్నట్లు బిల్లుపై చర్చ కు సమాధానం ఇస్తూ ఆర్థిక మంత్రి పి.చిదంబరం చెప్పారు. ఈ బిల్లును చట్టం చేయవద్దని గత దశాబ్దకాలంగా దేశం లోని ఉద్యోగు లు, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు అనేక పోరాటాలు చేస్తూ వస్తున్నాయి. పిఎఫ్‌ ఆర్డీఏ బిల్లు ద్వారా పింఛన్‌ దారు లు దాచు కున్న సొమ్మును విదేశీ శక్తులు, మార్కెట్‌ మాటున దోచుకెళ్తాయన్న ఆందోళన అన్నివర్గాల నుండి వ్యక్తం అవ్ఞతున్నది. ఈ వాదనతో ప్రతిపక్షాలైన వామపక్షాలు, తృణమూల్‌, డియంకే, అన్నాడియంకే, సమాజ్‌వాది పార్టీలు వ్యతిరేకిస్తూ అనేక సవరణలు ప్రతిపాదించిన వాటిని తిరస్కరిస్తూ యుపిఏ,బిజెపితో చేతులు కలిపి దొడ్డిదారిన బిల్లును ఆమోదించింది.2004 జనవరి ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 2004 సెప్టెంబర్‌ 1 తర్వాత చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్‌ (కంట్రిబ్యూటరీ) వర్తిం పచేశారు.

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 సెప్టెంబర్‌ 22న జి.ఓ.నెం. 653, జి.ఓ.నెం 654, జి.ఓ.నెం. 655 ద్వారా కంట్రి బ్యూటరీ పెన్షన్‌ స్కీంనురాష్ట్రం అమల్లోకి తెచ్చారు. 16 రాష్ట్రాలు పాత పెన్షన్‌ విధానం నుండి నూతన పెన్షన్‌ విధానానికి మారి అమలు చేస్తున్నాయి. దీనిప్రకారం ఉద్యోగుల జీతంలో 10 శాతం, ప్రభుత్వం పది శాతం, కలిపి పెన్షన్‌ నిధిలో జమచేస్తారు. ఆ నిధిని షేర్‌ మార్కెట్‌లో 50శాతం, ప్రభుత్వసెక్యురిటీలో 30శాతం, ఇతర సంస్థల్లో 20శాతం జమచేస్తారు. పదవీ విరమణ సమయంలో 60 శాతం ఇస్తారు. మిగిలిన 40శాతం ఇన్సూరెన్స్‌ సంస్థలలో యాక్యు టీ కిందతీసుకోవడం దీనిమీద వచ్చేఆదాయం పెన్షన్‌గా భావించాలి.

కేంద్ర ప్రభుత్వం 2014 ఫిబ్రవరి 1 పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ ఆథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) చట్టం తీసుకొచ్చింది. ఇది అమల్లోకి వస్తే జీవితం కాలం దాచుకున్న తమ సొమ్ముపై వేతన జీవ్ఞలకు ఎలాంటి ఆధారంలేకుండాపోతుంది. దీనివలన మార్కెట్‌ శక్తులకే లాభం కలుగుతుంది. అంబానీ, అదాని వంటికార్పొరేట్‌ శక్తులకు ఆ సొమ్ము వెళుతుంది. మార్కెట్‌ శక్తుల చేతుల్లో పిఎఫ్‌ డబ్బులు ఉండటం వలన రిటైరైనా పింఛన్‌ ఎంత వస్తుందో తెలియని అయోమయ స్థితిలో ఉద్యోగులు ఉన్నారు.

పాత పెన్షన్‌ విధానం వలన ఉద్యోగి రిటరైన నాటికి అతనికి వస్తున్న వేతనంలో 50 శాతం పెన్షన్‌ వస్తుండేది. సిపిఎఫ్‌ పరిధిలో 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 56 లక్షల మంది, తెలంగాణ ఉద్యోగులు 1,20,571 మంది ఎ.పి.లో ఒక లక్ష 50వేల మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులో రాష్ట్రాలకు సిపిఎస్‌ అమలుకు వెసులుబాటు కల్పించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పెన్షన్‌ (2004) లేదా పాత పెన్షన్‌ను అమ లు చేసుకోవచ్చని ఆరాష్ట్రాలకు వదిలివేసింది.దీనితో పశ్చిమబెం గాల్‌, త్రిపుర, ఢిల్లీ,రాష్ట్రాల్లో పాత పెన్షన్‌ విధానం అమల్లో ఉంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు కూడా పాత విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. కొత్తగా ఏర్పడిన తెలం గాణ రాష్ట్రంలో పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ఉద్యో గ, ఉపాధ్యాయ కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నా యి.నూతన కంట్రిబ్యూటరీవిధానం లోపభూయిష్టమైంది. ఉద్యోగు లకు ఆర్థిక భద్రతలేని ఈ విధానాన్ని రద్దు చేయాలని ఎఐటియుసి డిమాండ్‌ చేస్తూ సిపిఎఫ్‌ రద్దు కొరకు ఉద్యమిస్తున్న ఉద్యోగ, ఉపా ధ్యాయ కార్మిక సంఘాలకు పూర్తి సంఘీభావం ప్రకటిస్తుంది.

– ఉజ్జిని రత్నాకర్‌రావు

(రచయిత: ప్రధాన కార్యదర్శి, ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర సమితి)