సినీ కార్యాలయాలపై ఐటి దాడులు

IT
IT

సినీ కార్యాలయాలపై ఐటి దాడులు

సురేష్‌ ప్రొడక్షన్స్‌ సహా పలువ్ఞరు బడా నిర్మాతల ఇళ్లలో తనిఖీలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సిటీలోని సినీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. బుధవారం ఉదయం నుండి ఆదాయపు పన్ను శాఖ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి నగరంలోని వివిధ సినీ ప్రొడక్షన్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ (దగ్గుబాటి సురేష్‌), నార్త్‌ స్టార్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ (శరత్‌ మరార్‌), డీవీవీ ఎంటర్‌ టైన్‌మెంట్‌ (నిర్మాత దానయ్య), సీకే ఎంటర్‌ టైన్‌మెంట్‌ (సి కల్యాణ్‌), హారికా అండ హాసినీ క్రియేషన్స్‌ (రాధాకృష్ణ), భవ్య క్రియేషన్స్‌ కార్యాలయాల్లో ఈ సోదాలు చేశారు. ఆదాయ లెక్కలకు సంబంధించిన వివరాలను చెప్పాలని ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు పంపారు. మూడు, నాలుగు నెలలుగా ఆదాయపు లెక్కల వివరాలను తెలియచేయాలని ఇచ్చిన నోటీసులకు నిర్మాతల నుంచి స్పందన రాలేదు. దీంతో అనివార్యంగా తనిఖీలు చేయక తప్పడం లేదని ఆదాయపు పన్ను శాఖ అధికారవర్గాలు వెల్లడించాయి. ఆదాయపు పన్ను సరిగ్గా కట్టారా లేదా అన్నదానిపై ప్రశ్నించారు. ఆలాగే కార్యాల్లోని డాక్యుమెంట్లు, రికార్డులను అధికారులు పరిశీలించారు.