సినిమాలోనూ అదే పవర్‌

touch chesi chudu
touch chesi chudu

మాస్‌మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘టచ్‌చేసి చూడు. బేబీ భవ్య సమర్పణలో నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) , వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. విక్రమ్‌ సిరికొండ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాశీఖన్నా, సీరత్‌కపూర్‌ నాయికలు. ఈసినిమా సెన్సార్‌ పూర్తిచేసుకుని యుబైఎ సర్టిఫికెట్‌ అందుకుంది. ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రీరిలీజ్‌ వేడుకలో వివి వినాయక్‌ ఆడియో సిడిలను ఆవిష్కరించారు. అనంతరం రవితేజ మాట్లాడారు. జామ్‌ 8 వండర్‌ఫుల్‌ మ్యూజిక్‌ను అందించారన్నార. రామ్‌లక్ష్మణ్‌, వెంకట్‌, రవివర్మ, అన్భు ఆరివు , పీటర్‌ హెయిన్స్‌ అందరూ మంచి యాక్షన్‌ సీన్స్‌ కంపోజ్‌ చేశారన్నారు. దర్శకులు మంచి క్లారిటీ ఉన్నవ్యక్తి అని, ఈసినిమాను అద్భుతంగా తీశారన్నారు. వక్కంతం చాలా మంచి కథ అందించారన్నారు. ఈ సినిమాతో మనకు మంచి డైరెక్టర్‌ రాబోతున్నారన్నారు. ఈసినిమా హిట్‌ అయితే ఆ క్రెడిట్‌ అంతా విక్రమ్‌దే అని అన్నారు. దర్శకుడు విక్రమ్‌ మాట్లాడుతూ, నా స్నేహితులు నా సినిమా కోసం ఎంతో సపోర్ట్‌చేశారన్నారు. నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీగార్లకు కృతజ్ఞతలు అన్నారు. రవితేజ సినిమాతో నేను డైరెక్టర్‌ఝగా పరిచయం కావటం నా అదృష్టం అన్నారు. ఈ టైటిల్‌లో ఎలాంటి పవర్‌ ఉంటుందో సినిమాలో అంతే పవర్‌ ఉంటుందన్నారు. మంచి మెసేజ్‌కూడ ఉందన్నారు. కార్యక్రమంలో వివి వినాయక్‌, ఆకాష్‌సేన్‌ గుప్తా, కౌశల్‌, గుడ్డు, రెహమాన్‌, కొడాలి వెంకటేశ్వరరావు, కాసర్ల శ్యామ్‌, మార్క్‌ కేడీ మ్యూజ్‌, జెమిని కిరణ్‌, హరీశ్‌ శంకర్‌ తదితరులు మాట్లాడారు.