సినిమాలకు సెలవ్‌..ఇక ప్రజాక్షేత్రమే

PAWAN KALYAN
PAWAN KALYAN

సినిమాలకు సెలవ్‌..ఇక ప్రజాక్షేత్రమే

అరుపులతో, కేకలతో సిఎం కాలేను
అప్పట్లో వంగవీటి రంగా హత్య అమానుషం
కులాల కుంపట్లను దాటితేనే ప్రపంచస్థాయి రాజధాని:
విజయవాడలో పవన్‌ కల్యాణ్‌

విజయవాడ: కులం కూడు పెట్టదు, కులం అభివృద్ధికి ఆటంకం, వారస త్వాలంటే నాకు ఇష్టం లేదు, అందుకే మా అన్నయ్యను వదిలేశా, సమాజశ్రేయస్సే నాకు ముఖ్యం, రాష్ట్ర ప్రజలు బాగుండాలని తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో మద్దతిచ్చా. రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్రం కష్టాల్లో వుంది. ఆ సమయంలో దక్షత గల నాయకుడైతేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని చంద్రబాబు నాయుడకు తాను మద్ధతిచ్చినట్లు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. అవసరమైతే ఎవరినైనా ప్రశ్నించటానికి నేను సిద్దం అని పవన్‌ కళ్యాణ్‌ ఆవేశంగా అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల కార్యకర్తలతో మేరిస్‌స్టెల్లా ఆడిటోరియంలో పవన్‌ కళ్యాణ్‌ శుక్రవారం సమా వేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన జనసేన లక్ష్యాలను వివరించారు. అమరావతిలో కులాల మధ్య పోరాటాలున్నాయన్నారు. అదే హైదరాబాద్‌లో అయితే ఎవరి కులమేదో కూడా ఎవరికీ తెలియ నంతగా అందరూ కలిసిపోయారన్నారు. విజయవాడ వరల్డ్‌ క్లాస్‌ రాజధాని కావాలంటే కులం పరిధిని అధిగమిస్తేనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అలాగే నిరాయుధిడిగా వున్న వంగవీటి రంగాను హత్యచేయడం తప్పు అని ఆయన అన్నారు. అప్పటినుండి విజయవాడలో కులాల కుంపట్లను రాష్ట్ర విభజన తరువాత కోపతాపాలకు పోతే అభివృద్ధి జరగదన్నారు. కమ్మ, కాపు, రెడ్డి అంటూ కులాలను పట్టుకుని వేలాడితే లాభం లేదన్నారు. కులాలు మతాలను దాటితేనే ప్రపంచస్థాయి రాజధాని నగరం నిర్మించగలమని ఆయన స్పష్టం చేశారు.