సిద్ధరామయ్యపై అమిత్‌షా వివాదాస్పద వ్యాఖ్యలు

AMIT SHAW
AMIT SHAW

న్యూఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కర్ణాటక సియం సిద్దరామయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సియం రూ. 40 లక్షల విలువైన వాచీ పెట్టుకుంటారని ,ఆ వాచీ ఎక్కడదని ప్రజలు అడిగితే సమాధానం చెప్పరని విమర్శించారు. ఇది తాను చేస్తున్న ఆరోపణ కాదని సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జే ఆరోపణ చేశారని అమిత్‌షా పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపుల్లో అన్యాయం చేస్తున్నామనే అనే వాదన అవాస్తవమని ఆయన అన్నారు.