సిటీ పోలీసు విభాగంలో 20 మంది పదవీ విరమణ

police
police

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పోలీసు విభాగంలో సుదీర్ఘ కాలంగా పనిచేసిన 20 మంది శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఇందు లో ఇద్దరు ఎస్‌ఐలు, ఎనిమిది మంది ఏఎస్‌ఐలు, ఐదుగురు జమెదార్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఇద్దరు ఇత ర సిబ్బంది వున్నారు. ఈ సందర్భంగా బషీర్‌బాగ్‌లోని కమిషనర్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సాయుధ బలగం అదనపు పోలీసు కమిషనర్‌ తోట మురళీ కృష్ణ పదవీ విరమణ చేసిన వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీసు విభాగం అధ్యక్షు డు శంకర్‌ రెడ్డి, చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ కె.లలిత, పోలీసు సహకార సంఘం నాయకులు పాల్గొన్నారు.