సిటీ పోలీసు విభాగంలో మహిళల శకం

గస్తీ బృందంలో మహిళా పోలీసుల నియామకం
పురుషులతో సమానంగా బైక్‌లపై పెట్రోలింగ్‌కు అవకాశాలు
హైదరాబాద్: నగర పోలీసు విభాగంలో మహిళల శకం మొదలైంది. ఇప్పటి వరకు దాదాపు అన్ని విభాగాల్లో పురుష పోలీసు సి బ్బందిదే ఆధిపత్యం కొనసాగగా ఈ ఆనావాయితీకి తెరదించుతూ గస్తీ బృందంలో మహిళా పోలీసులకు ప్రాధాన్యం ఇస్తూ సరికొత్త చరిత్రకు అంకురార్పణ చేశా రు. రాష్ట్ర పోలీసు విభాగం చరిత్రలోనే తొలిసారిగా మోటారు సైకిళ్లపై గస్తీ నిర్వహించే బృందంలో మహిళలను పెద్ద సంఖ్యలో నియమించడం ద్వారా సిటీ పో లీసు విభాగం మరో వినూత్న శకానికి నాంది పలికింది. నగర పోలీసు విభాగంలో 90 గస్తీ బృందాలను కేవలం మహిళలే నిర్వహించేందుకు వీలుగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా బుధవారం నాడు సెంట్రల్ జోన్లో మహిళా గస్తీ బృందాలను డిసిపి విశ్వప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు.
తెలంగాణ పోలీసు శాఖలో నవశకం మొదలైంది. మహిళల భద్రతకు షీ టీంలను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందగా ఇప్పుడు గస్తీ బృందాలలో మొదటిసారిగా మహిళలను నియమించడం ద్వారా సిటీ పోలీసు విభాగం మరో అడుగు ముందుకు వేసింది. వాస్తవంలో చెప్పాలంటే పోలీసు శాఖలో మహిళలకు సరైన ప్రాధాన్యం లేదు. 2009లో సబితా ఇంద్రారెడ్డి హోం మంత్రి అయిన తరువాత పోలీసు శాఖలో మహిళలకు ఐదు శాతం రిజర్వేష న్ కల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇది కొన్ని విభాగాలో కొంతమేర పెరిగినా సరైన అభ్యర్థులు దొరక్కపోవడంతో చాలా వరకు పోస్టులు ఖాళీ గా వుండి పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ పోస్టులను పురుషులతో భర్తీ చేసేస్తున్నారు. అయినప్పటికీ సివిల్, సాయుధ బలగంలో ఇటీవల కాలంలో మహి ళల సంఖ్య గణనీయంగానే పెరిగింది. ప్రస్తుతం అన్ని పోలీసు స్టేషన్లలో ఐదు నుంచి పది మంది వరకు మహిళా సిబ్బంది వున్నారంటే పరిస్థితి మెరుగుపడింద నే చెప్పాలి. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రెండవ వైపు వున్న అంశాలను పరిశీలిస్తే మహిళా పోలీసులను స్టేషన్లలో బాధితుల నుంచి ఫిర్యా దులను స్వీకరించేందుకు, వారి వాంగ్మూలం సేకరించేందుకు, ఎక్కడైనా ఆందోళనలు జరిగినపుడు బందోబస్తు కోసం మాత్రమే వాడుతున్నారు. కేసుల విచారణ, గస్తీ నిర్వహణ వంటి విభాగాలలో మహిళలను నియమించడం లేదనే అపవాదు పోలీసు శాఖ చాలా కాలం నుంచి చవిచూస్తోంది. ఆఖరుకు మహిళా పోలీసు స్టేషన్లలో కూడా పురుష ఇన్స్పెక్టర్లు, ఎసిపిలు, ఇతర సిబ్బంది వుండడం చెప్పుకోదగ్గ అంశం. దీనిపై మహిళా సంఘాల నుంచి విమర్శలు వచ్చినా పోలీసు శాఖ లో మాత్రం స్పందన లేదు. ఈ విమర్శలు ఇలావుంటే నగర పోలీసు విభాగంలో కీలకమైన క్రైం అండ్ సిట్ విభాగానికి అదనపు కమిషనర్‌గా వరుసగా రెండవ సారి కూడా మహిళా ఐపిఎస్ అధికారినే నియమించడం ద్వారా పోలీసు శాఖలో మహిళలకు ప్రాధాన్యం తగ్గుతుందనే వాదనకు సర్కారు కొంతమేర తగ్గించింది.
రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈ పోస్టులో స్వాతి లక్రా నియమితులు కాగా ఇప్పుడు షిఖా గోయల్ వున్నారు. స్వాతి లక్రా హయాంలోనే షీ బృందాలు ఏర్పాటు కా గా ఇప్పుడు ఆమె నేేతృత్వంలోనే ఇవి రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నాయి. మరోవైపు సిటీ పోలీసు విభాగంలో మహిళల పాత్రను మరింత పెంచేందుకు చర్యలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే సిటీ పోలీసు విభాగంలో తొలిసారిగా మైటారు సైకిళ్ల గస్తీ బృందంలో సుశిక్షుతులైన మహిళలను నియమించారు. వీరంతా పురుషులతో సమానంగా మోటారు సైకిళ్లపై గస్తీ కాస్తూ తాము మగవారికన్నా ఏం తక్కువకామని నిరూపించుకునేందుకు అవకాశం ఇచ్చారు. పోలీసు శాఖలో మ హిళలు ఎంతమాత్రం తక్కువ కారని నిరూపించేందుకుగానూ గోషామహల్లో వారం రోజుల క్రితం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న మహిళా పోలీసు సిబ్బంది గొప్ప ప్రదర్శన ఇచ్చారు. మహిళా కమెండోలు ధైర్యంగా చేసిన మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు అబ్బుర పరిచాయి. ఈ సందర్బంగానే మోటారు సైకిళ్లపై గస్తీ నిర్వహించే 90 మహిళా బృందాలను నగర పోలీసు కమిషనర్ ఆవిష్కరించారు. ఈ బృందాలు విడతల వారిగా ఆయా ప్రాంతాలలో గస్తీ నిర్వహిస్తారని ఆయన ప్రకటిం చారు. ఇందులో భాగంగా బుధవారం నాడు సెంట్రల్ జోన్ పరిధిలో 15 బృందాలను డిసిపి విశ్వప్రసాద్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖలో మహిళల సంఖ్యను పెంచేందుకే ఈ బృందాలను ప్రారంభించామని తెలిపారు. మహిళా పోలీసులు గస్తీ నిర్వహణలో ఇతర పోలీసులతో సమానంగా వుంటారని ఆయన తెలిపారు. కాగా గస్తీ బృందంలో నియమించబడ్డ మహిళా పోలీసులు మోటార్ సైకిళ్లపై గస్తీ కాస్తూ తాము పురుషులతో ఎంత మాత్రం తక్కువకామని నిరూపించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మహిళా గస్తీ బృందాలను నియమించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.