సిక్కోలును ఆదుకుంటా

AP CM BABU VISITS TITLEY EFFECTED AREA
AP CM BABU VISITS TITLEY EFFECTED AREA

సిక్కోలును ఆదుకుంటా

జిల్లా వ్యాప్తంగా 169 గ్రామాలు అతలాకుతలం
వరదముప్పులో సిక్కోలు గ్రామాలు
చిన్నాభిన్నమైన గెడ్డూరు , ప్రజలకు తక్షణ చర్యలు
తుఫాన్‌ బాధితులకు పరిహారం

తిత్లీ తుఫాన్‌ బాధిత ప్రాంతాల్లో సిఎం చంద్రబాబు పర్యటన

శ్రీకాకుళం, విజయనగరం:

తిత్లీ తుఫాన్‌ ధాటికి సర్వం కోల్పోయిన సిక్కోలు బాధిత ప్రాంతాల ప్రజలకు తక్షణ చర్యలు అందిస్తూ అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం తిత్లీ తుఫాన్‌ బాదిత ప్రాంతాల్లో సి.ఎం పర్యటించారు. శ్రీకాకుళం నుంచి నేరుగా పలాస సి.ఎం చేరుకున్నారు. అక్కడ ప్రజలకు అబివాదం చేశారు. పలాస ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద పడి ఉన్న చెట్లను పరిశీలించి తక్షణమే తొలగింపునకు కలెక్టర్‌ ధనుంజ§్‌ురెడ్డికి తగు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కాశీబుగ్గ స్టేషన్‌ వద్ద కూలిన చెట్లను పరిశీలించి తక్షణమే చెట్లను తొలగించాలని ఆదేశించారు. అక్కడి నుంచి నేరుగా రైల్వే క్వార్టర్స్‌్‌కు బయలుదేరి అక్కడ ప్రజలతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైల్వేస్టేషన్‌కు చేరుకుని తిత్లీ తుఫాన్‌కు అస్తవ్యస్థమైన రైల్వేస్టేషన్‌ను పరిశీలించారు.

అనంతరం వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి వెళుతూ మార్గమధ్యలో తుఫాన్‌కు నష్టపోయిన జీడితోటలను పరిశీలించారు. అక్కడ గ్రామస్తులను ఓదార్చారు. దైర్యంగా ఉండాలని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందన్నారు. పిల్లలకు భోజనాలు పెట్టాలని పేదవారందరికీ రేషన్‌షాపుద్వారా 25 కిలోల బియ్యం, మత్స్యకారులకు 50 కేజిల బియ్యం ఈ రోజు నుంచే అందించాలని అధికారులకు ఆదేశించారు. తాగునీరు, విద్యుత్‌కు ఎలాంటి ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నామని ప్రజలకు హామీ ఇచ్చారు. రహదారులు ఇతరత్రా సౌకర్యాలు అతిత్వరలోనే కల్పించనున్నట్లు తెలిపారు. పునరావస చర్యలకు గాను అవసరమైతే మరిన్ని బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. అక్కుపల్లి గ్రామాలతో పాటు గరుడభద్ర గ్రామంలో సర్వనాశమైన జీడితోటలను సి.ఎం స్వయంగా పరిశీలించారు. వారందరికీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తిత్లీ తుఫాన్‌ ప్రభావానికి జిల్లా వ్యాప్తంగా 169 గ్రామాలు అతలాకుతలమయ్యాయని సి.ఎం స్పష్టం చేశారు. 12 మండలాల్లో యుద్దప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు సి.ఎం తెలిపారు. తుఫాన్‌ ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. ఉద్దానంలో కొబ్బరి, అరటి, జీడిమామిడి తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. వీటిన్నింటినీ సి.ఎం ఎరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు.

బలమైన గాలులకు 17 మండలాల్లో ఏడు వేల విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయని స్పష్టం చేశారు. 110 బృందాలు, 2,200 మంది విద్యుత్‌ సిబ్బంది పని చేస్తున్నారని సి.ఎం తెలిపారు. ఆదివారం నాటికి సిక్కోలు ప్రాంతమంతా విద్యుత్‌ను పునరుద్దరించాలని సి.ఎం.డిని ఆదేశించారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్దరించడం జరిగిందని తెలిపారు. వదర ముప్పులో సిక్కోలు గ్రామాలు : తిత్లీ తుఫాన్‌ బీభత్సానికి శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది. తుఫాన్‌ తీరం దాటి 24 గంటలు దాటినా జిల్లా వాసులు దాని ప్రభావం నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు.

ఎటువైపు చూసిన నేలకొరిగిన చెట్లు, కూలిన ఇళ్లు, నీటమునిగిన రహదారులు, పరిస్థితి బీభత్సంగా ఉంది. తుఫాన్‌ ముప్పు తప్పినప్పటికీ వరద పోటుతో ప్రజలు నానా హైరానాపడుతున్నారు. సిక్కోల్లో అనేక ప్రాంతాల్లో ఇంకా ముంపులోపే ఉన్నాయి. మరోవైపు వంశదార నదిలో వరదనీటి మట్టం పెరగడంతో నదీ తీర ప్రాంత గ్రామాల్లోని భయాందోళన చెందుతున్నారు. చిన్నాభిన్నమైన గెడ్డూరు : జిల్లాలో మందస మండలం దున్నవూరు పంచాయతీ గెడ్డూరు గ్రామం తిత్లీ తుఫాన్‌ విద్వంసంతో చిన్నబిన్నమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం గెడ్డూరు గ్రామస్తులు మాట్లాడుతూ తాము వాడబలిజ కులానికి చెందినవారమని తమ ప్రదాన వృత్తి చేపలవేట అన్నారు. జీడిమామిడి, కొబ్బరిపంటల ద్వారా సంపాదన చేసుకుంటామని తెలిపారు.

తిత్లీతుఫాన్‌ కారణంగా తమ గ్రామానికి చాలావరకు అస్థినష్టం జరిగింది ప్రదానంగా పది ఇళ్ల పూర్తిగా శిథిలమైపోగా ఇంకా 20 ఇళ్లు వరకు పాక్షికంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పడవులు, వలలు, సముద్రపు అలలకు కొట్టుకుపోయాయన్నారు. జీడి, కొబ్బరితోటలు పూర్తిగా ధ్వంసంమయ్యాయన్నారు. రాకపోకలు పూర్తిగా నిలిచాయన్నారు. ముసలివాళ్ళకు, పిల్లలకు వైద్య మందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు ప్రాథ మిక వైద్యం అందేలా ప్రభుత్వం సాయం చేయాలని చూస్తున్నారు. తుఫాన్‌ బాధితులకు పరిహారం : తిత్లీ తుఫాన్‌ ప్రమాదంతో మృతి చెందిన కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని సిఎం చంద్రబాబు ప్రకటించారు. జిల్లాలో 19 మండలాలు 196 గ్రామాలపై తుఫాన్‌ ప్రభావం అధికంగా ఉందన్నారు.

దాదాపు లక్షా 40 వేల హెక్టార్లు పంట నాశనమైనట్లు ప్రాథమిక అంచనా వేశామన్నారు. ఉత్తరాంధ్రలో జాతీయ రహదారిపై భారీ ట్రక్‌లు సైతం బోల్తా పడటం చూస్తుంటే తుఫాన్‌ బీభత్సం ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతుందన్నారు.