సికింద్రాబాద్ – విశాఖ మ‌ధ్య ప్ర‌త్యేక రైళ్లు

Rly Passengers

ప్ర‌యాణికుల ర‌ద్దీ దృష్ట్యా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే రెండు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌ప‌నుంది . ఈ ప్ర‌త్యేక రైళ్లు సికింద్రాబాద్ – విశాఖ మ‌ధ్య న‌డ‌వ‌నున్నాయి. ఈ నెల 18న మ‌ధ్యాహ్నం 3.55 గంట‌ల‌కు సికింద్రాబాద్ నుంచి విశాఖ‌కు ప్ర‌త్యేక రైలు న‌డ‌ప‌నున్నారు. అలాగే ఈ నెల 19న రాత్రి 9.25 గంట‌ల‌కు విశాఖ నుంచి సికింద్రాబాద్ కు ప్ర‌త్యేక రైలు న‌డుపుతున్న‌ట్లు అధికారులు తెలిపారు.