సికింద్రాబాద్‌ యశోదలో అగ్ని ప్రమాదం

Yasoda
Yasoda Hospital

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో నేడు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మండలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు, రోగుల స‌హాయ‌కులు భయాందోళనకు గురయ్యారు. కాగా ఈ ప్రమదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.