సికింద్రాబాద్‌-పాట్నా ప్రత్యేక రైళ్లు

 

patna111

సికింద్రాబాద్‌-పాట్నా ప్రత్యేక రైళ్లు
మెట్టుగూడ: పండుగల దృష్ట్యా ప్రయాణికుల రద్దీకి తగ్టట్టుగా సికింద్రాబాద్‌-పాట్నా మధ్య రెండు ప్రత్యేక సూపర్‌ఫాస్ట్‌ రైళ్లను నడపనున్నట్టు రైల్వేశాఖ తెలిపింది. ఇవి వారణాని, అలహాబాద్‌ మీదుగా పాట్నా చేరుకుంటాయి. హోలీ పండుగ దృష్ట్యా నెం: 02793 సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ఈనెల 20న ఆదివారం రాత్రి 9 .40 గంటలకు బయలుదేరి మంగళవారం ఉదయం 10 గంటలకు పాట్నాకు చేరుకుంటుంది.. తిరుగు ప్రయాణంలో రైలు నెం: 02794 మార్చి 25వ తేదీ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు పాట్నా నుంచి బయలుదేరి శనివారం రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ చేరకుంటుందని తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లకు కాజీపేట, రామగుండం, బల్హార్షా, నాగ్‌పూర్‌, ఇటార్సీ, జబల్‌పూర్‌, సాత్నా, మాణిక్‌పూర్‌, అలహాబాద్‌, వారణాసి, మొగల్‌సరా§్‌ు, బుక్సార్‌, అరా, దనాపూర్‌ స్టేషన్లలో హాల్ట్‌ ఉంటుందన్నారు.