సికింద్రాబాద్‌లో రౌడీషీట‌ర్ హ‌త్య‌

Murder
Murder

హైదరాబాద్‌: సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పరికి బస్తీలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. రౌడీషీటర్ ఫరీద్‌పై ముందుగా కల్లలో కారం చల్లిన దుండగులు వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి చంపారు. విగతజీవిగా పడి ఉన్న ఫరీద్‌ను చూసిన పాదచారులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన ఫరీద్‌పై చిలకలగూడ పోలీస్‌స్టేషన్లో పలు కేసులతో పాటు రౌడీషీట్‌ తెరిచి ఉంది. ఇద్దరు మహిళలతో పాటు మరో నలుగురు అతడిపై దాడి చేసినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే రెతిఫైల్‌ బస్‌స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నిందితుల్లో ఇద్దరిని పోలిసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.