సికింద్రాబాద్‌లో మ‌రో నిర్భ‌య‌పై అత్యాచారం

Rape Attempt
Rape

సికింద్రాబాద్: నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీలో జరిగిన నిర్భయ తరహ సంఘటన చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ ఆర్మీ జవాన్ కూతురిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాడ్డుతో కొట్టి, నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే… స్పృహ కోల్పోయి ఉన్న బాలికను స్థానికులు గమనించి తల్లిదండ్రులకు సమాచారమందించారు. ఈ సంఘటన రెండు నెలల క్రితం జరిగింది. కాగా… ఈ దారుణానికి పాల్పడ్డ వారిని ఇప్పటికీ పోలీసులు అరెస్టు చేయలేదని సమాచారం. అంతేగాకుండా గుట్టుచప్పుడు కాకుండా కేసును క్లోజ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.