సిఎం రేవంత్‌రెడ్డి అంటూ యువకుల కేకలు

revanth reddy
revanth reddy

మహబూబాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి మహబూబాబాద్‌లో గురువారం నిర్వహించిన ప్రచార సభలో వేసిన పంచ్‌ డైలాగ్‌లు ప్రజాకూటమి నేతల్లో జోష్‌ను నింపాయి. మానుకోటకు రేవంత్‌రెడ్డి వస్తున్నారనే సమాచారంతో పార్టీ శ్రేణులతో పాటు యువకులు ఆయన ప్రసంగాన్ని వినడానికి స్వచ్ఛందంగా తరలివచ్చారు. సూమారు గంట పాటు సిఎం కెసిఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తూ సాగిన ఆయన ప్రసంగం అందరీని ఉత్తేజపరిచింది. ఆయన మాట్లాడినంత సేపు సీఏం రేవంత్‌ రెడ్డి అంటూ నినాదాలు హోరెత్తాయి. రేవంత్‌రెడ్డి ప్రసంగం ఆరంభంలోనే మీడియా గ్యాలరీలోకి చొచ్చుకొచ్చిన ప్రజలు బారికేడ్లను సైతం దాటుకుని వెళ్లె ప్రయత్నం చేశారు. తెలంగాణ యాసలో ప్రసంగాన్ని చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులపై విరుచుకుపడుతూ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.సిఎం రేవంత్‌రెడ్డి అంటూ యువకులు నినాదాలు  చేశారు.