సిఎం జగన్‌కు కన్నా లేఖ

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని సూచన

kanna laxmi narayana
kanna laxmi narayana

అమరావతి: ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి లేఖ రాశారు. ఇందులో లాక్‌డౌన్‌ కారణంగా ఉఫాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాని కోరారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా అనేక మంది భవన నిర్మాణ కార్మికులు ఉఫాధి కోల్పోయారని అన్నారు, అంతేకాకుండా ప్రభుత్వ ఏర్పడిన కొత్తలో నూతన ఇసుక విధానం తీసుకురావడం వల్ల కొన్ని నెలల పాటు పనులు ఆగిపోయాయని, అలాగే మూడు రాజధానుల పేరుతో అనేక రకాల నిర్మాణాలు ఆగిపోయిన కారణంగా కార్మికులు ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం కేటాయించిన రూ.196.75 కోట్లను వినియోగించాలని సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/