సిఎం గెటప్‌లో స్టైలిష్‌గా

MAHESH BABU
MAHESH BABU

సిఎం గెటప్‌లో స్టైలిష్‌గా

తెలుగు ఇండస్ట్రీలో మహేష్‌బాబు బిజినెస్‌ స్టామినా వేరు.. అతనిసినిమాలు హిట్‌, ప్లాప్‌తోసంబంధం లేకుండా బిజినెస్‌ జరుగుతూ ఉంటుంది.. ఒక సినిమా ప్లాప్‌ అయినా నెక్ట్స్‌ సినిమాకి మరలా అతని వేవ్‌ అతనికి వచ్చేస్తుంది.. తాజాగా మహేష్‌బాబు మురుగదాస్‌తో చేసిన స్పైడర్‌ సినిమా డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.. ఈసినిమా తర్వాత మహేష్‌ ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్‌లో ఉఆన్నరు. .కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భరత్‌ అనే నేను.. రెగ్యులర్‌ షూటింగ్‌కి కొంత విరామం కూడ ఇచ్చారు.. స్పైడర్‌ తర్వాత నేపథ్యంలో ఇపుడు మహేష్‌ తన సినిమాపై మరింత దృష్టిపెట్టారు. భరత్‌ అనే నేను.. సినిమాలో మహేష్‌ లుక్‌ ఒకటి బయటకు వచ్చింది.. ఈ లుక్‌లో మహేష్‌ మరోసారి స్టైలిష్‌గా కన్పిస్తున్నారు.. మందు వెనుక గన్‌మెన్‌లతో ఉన్న మహేష్‌ పక్కనే బ్రహ్మాజీ కూడ కన్పిస్తూ ఉండటం గమనార్హం.. ఈ లుక్‌ ఇపుడు అందరినీ ఆకట్టుకుని వైరల్‌ అవుతోంది.. భరత్‌ అనే నేను ..సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా చేస్తున్నసంగతి తెలిసిందే.