సిఎం కెసిఆర్‌కు లేఖ రాసిన జి.కరుణాకర్‌రెడ్డి

oc welfare association leader karunakar reddy ,kcr
oc welfare association leader karunakar reddy ,kcr

సైఫాబాద్‌, : అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పది శాతం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్‌లను తక్షణమే అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ, శాసన మండలిని సమావేశపరిచి, చర్చించి తీర్మానం చేసి అమలుకు ఆదేశాలు జారీ చేయాలని ఓసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాయడం జరిగిదని శుక్రవారం నాడిక్కడ పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. అగ్రవర్ణాలకు ప్రకటించిన రిజర్వేషన్‌లను ఇప్పటికే గుజరాత్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, రాజస్తాన్‌ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేస్తామని ప్రకటించాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్‌లు అమలు చేసి అగ్రవర్ణ పేదల అభివృద్ధికి కృషి చేయాలని, ఇందకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గజిట్‌ను రాష్ట్రంలో యధాతధంగా అమలు చేయాలన్నారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలతోపాటు, ఇతర ఉద్యోగాల నియామకాలకు రిజర్వేషన్‌లు తక్షణమే వర్తించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే రిజర్వేషన్‌లతోపాటు వయోపరిమితి సడలింపు, ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా 1000 కోట్లతో వైశ్య, రెడ్డి కార్పోరేషన్‌లను ఏర్పాటు చేయాలని ఆయన సిఎంను కోరారు. ఈ నెల నుంచి విడుదలయ్యే విద్యా, ఉద్యోగ ప్రవేశాలకు నియమకాలు వర్తించేలా ఆదేశాలు జారీ చేసి అన్ని పోటి పరీక్షలకు ఓబిసిలతో సమానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని జి.కరుణాకర్‌రెడ్డి కోరారు.