సిఎం కెసిఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్‌: ఎంపి రేవంత్‌రెడ్డి రైతుల సమస్యలపై సిఎం కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రాజీవ్ రైతు భరోసా దీక్షలో అనేక మంది రైతులు..వారి సమస్యలు తన దృష్టికి తెస్తున్నారని తెలిపారు. రెండేళ్లైనా లక్ష రుణమాఫీ హామీ అమలు కాలేదని విమర్శించారు. బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదన్నారు. రైతుబంధు నిధులు పాతరుణాల వడ్డీ కింద జమేసుకుంటున్నారని మండిపడ్డారు. తక్షణం రుణమాఫీ నిధులు విడుదల చేయాలని రేవంత్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.