సిఎంతో హీరో భేటీ

HERO VIJAY

సిఎంతో హీరో భేటీ

తమిళస్టార్‌హీరో విజ§్‌ు తమిళనాడు సిఎం పళనిస్వామితో ఆదివారం ఆకస్మికంగా భేటీ అయ్యారు.. ఇలా విజ§్‌ు సిఎంను స్వయంగా కలవటం సినీ, రాజకీయవర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.. తన తదుపరి చిత్రం ‘మెర్సల్‌కు విడుదలకు ఎలాంటిఇబ్బంది కలగకుండా ఉండేందుకు కలిశారని చాలా మంది అంటే.. మరికొందరు రాజకీయ చర్చలు కూడ జరిగిఉండవచ్చని అంటున్నారు.. తమిళ సినీవర్గాల సమాచారం ప్రకారం.. ఆయన తన సినిమా విడుదల గురించి కాదనీ, రాజకీయాల విషయాలు కాదని, కేవలం లోకల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్యాక్‌్‌సను 10శాతం నుంచి 8 శాతానికి తగ్గించినందుకు కృతజ్ఞతలు చెప్పటానికి మాత్రమే కలిశారని అంటున్నారు.. కాగా ఆట్లీ డైరెక్టు చేసిన ‘మెర్సల్‌ చిత్రం ఈనెల 18న తమిళంతపాటు తెలుగులో ‘అదిరింది పేరుతో విడుదల కానుంది.