సింధు వేత‌నం ఖ‌రారు చేసిన ఏపి

P.V.Sindhu
P.V.Sindhu

అమ‌రావ‌తిః బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధుకు ఉప కలెక్టర్‌ హోదాలో ఇచ్చే జీతాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమెకు రూ.40270-93780 పే స్కేల్‌గా ఇస్తారు. రెవెన్యూలో సింధు కోసం సూపర్‌ న్యూమరీగా పోస్టు’ను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల్ని బుధవారం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ జారీ చేశారు. భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ పరిధిలో ఉప కలెక్టర్‌గా 72 వారాలపాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. మరో ఉత్తర్వు ద్వారా సింధు వివిధ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ పోటీలకు హాజరయ్యేందుకు, గోపీచంద్‌ అకాడెమీలో శిక్షణ తీసుకొనేందుకు అనుమతి మంజూరు చేశారు.