సాహో…శ్రీకాంత్‌

SRIKANTH
SRIKANTH

సాహో…శ్రీకాంత్‌

37 ఏళ్ల తర్వాత డెన్మార్క్‌ ఓపెన్‌ నెగ్గిన ఆటగాడిగా రికార్డ్‌

37 ఏళ్ల నిరీక్షణకు కిదాంబి శ్రీకాంత్‌ తెరదించాడు. ప్రతిష్టాత్మక డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ విజేతగా అవతరించాడు. ఆదివారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో 21-10, 21-5 తేడాతో దక్షిణ కొరియా ఆటగాడు లీ హున్‌ ఇల్‌పై ఘన విజయం సాధించాడు. 25 నిమిషాల వ్యవధిలోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం చెలాయించిన శ్రీకాంత్‌ తన ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.

1980లో ప్రకాశ్‌ పదుకొనె తర్వాత ఈ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత్‌ తరుపున ఫైనల్‌కు చేరిన రెండో క్రీడాకారుడిగా శ్రీకాంత్‌ గుర్తింపు పొందాడు. అంతేకాదు 1980లో ప్రకాశ్‌ పదుకొనె ఈ టోర్నీలో విజేతగా నిలవగా, ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కిదాంబి శ్రీకాంత్‌ ఈ సూపర్‌ సిరీస్‌ను నెగ్గాడు. ఇక మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత తరుపున సైనానెహ్వాల్‌ 2012లో టైటిల్‌ నెగ్గగా, పివి సింధు 2015లో రన్నరప్‌గా నిలిచింది. ఏడాదిలో మూడు సూపర్‌ సిరీస్‌లు గెలిచిన షట్లర్‌గా శ్రీకాంత్‌ డెన్మార్క్‌ ఓపెన్‌లో టైటిల్‌ సాధించడంతో ఈ ఏడాదిలో శ్రీకాంత్‌ గెలిచిన మూడో సూపర్‌ సిరీస్‌ ఇది.

ఇటీవల ఇండోనేషియా ఓపెన్‌, ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ గెలవడంతో పాటు… సింగపూర్‌ఓపెన్‌లోనూ రన్నరప్‌గానిలిచి అద్భుత మైన ఫామ్‌లో ఉన్నాడు. తాజా టైటిల్‌తో ఏడాదిలో మూడు సూపర్‌ సిరీస్‌లు గెలిచిన షట్లర్‌గా కిదాంబి శ్రీకాంత్‌ అరుదైన ఘనత సాధించాడు. బ్యాట్మింటన్‌ చరిత్రలో ఏడాదిలో 4 సూపర్‌సిరీస్‌ ఫైనల్స్‌ ఆడిన ఆరో ఆటగాడిగా కూడా 24ఏళ్ల శ్రీకాంత్‌ ఘనత సాధించాడు. అందరూ ఆశ్చర్యపోయేలా శ్రీకాంత్‌ ప్రదర్శన డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నమెంట్‌ టైటిల్‌ను శ్రీకాంత్‌ ఇంత అలవోకగా గెలుస్తాడని బహుశా ఎవరూ ఊహించి ఉండక పోవచ్చు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో ప్రస్తుత పోటీ దృష్ట్యా ఓ సూపర్‌ సిరీస్‌ టోర్నీ ఫైనల్‌ ఆధ్యంతం హోరాహోరీగా సాగుతుందని అందరూ భావించారు. కానీ ఇలా వచ్చి అలా గెలిచాడు.

కేవం 25 నిమిషాల్లో ఫైనల్‌ను ముగించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. టివి ముందు ప్రేక్షకులను…కోర్టులో ప్రత్య క్షంగా వీక్షిస్తున్న ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. లీ హున్‌ ఇల్‌ది మామూలు ప్రతిభకాదు 20ఏళ్లుగా అంతర్జాతీయ సర్క్యూట్‌లో ఆడుతుండటం… 615 మ్యాచ్‌ల అనుభవం. అయినా శ్రీకాంత్‌ ఇదేమి పట్టించుకోలేదు. కేవలం తనకు తెలిసిన పద్ధతిలో ఆరంభం నుంచే దూకుడుగా ఆడి విజయం సొంతం చేసుకున్నాడు. తొలి గేమ్‌ ఆరంభంలో వరుసగా రెండు పాయింట్లు కోల్పోయినా శ్రీకాంత్‌ ఆ తర్వాత చెలరేగాడు.

వరుసగా రెండు లేదా మూడు పాయింట్లు సాధిస్తూ ముందుకు సాగాడు. స్కోరు 13-8వద్ద శ్రీకాంత్‌ వరుసగా 7 పాయింట్లు గెలిచి 20-8తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం లీ హున్‌ రెండు పాయింట్లు గెలిచినా, శ్రీకాంత్‌ మరో పాయింట్‌ నెగ్గి తొలి గేమ్‌ను 13 నిమిషాల్లో దక్కించుకున్నాడు. ఇక రెండో గేమ్‌లోనూ శ్రీకాంత్‌ తొలి పాయింట్‌ను ప్రత్యర్థికి కోల్పోయాడు. ఆ తర్వాత ఈ హైదరా బాద్‌ ప్లేయర్‌ విశ్వరూపమే చూపించాడు. వరుసగా 11 పాయింట్లు గెలిచి 11-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత కూడా శ్రీకాంత్‌ తన జోరును కొనసాగించడంతో లీ హున్‌ రెండో గేమ్‌ను 12 నిమిషాల్లో కోల్పోయి చేతులెత్తేశాడు. శ్రీకాంత్‌ వ్యూహాన్ని పక్కాగా అమలు చేశాడు.

ఆటతీరుకు తగ్గట్లు కోర్టులో పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో శ్రీకాంత్‌ దాన్ని అనుకూలంగా మలుచుకొని ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. దూకుడుగా ఆడాలని నిర్ణయించుకొని ఆడా డెన్మార్క్‌ ఓపెన్‌లో లీ హుల్‌ ఇల్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. మేమిద్దం గతంలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకపోయినా ఈ టోర్నీలో అతని మ్యాచ్‌లను పరిశీలించి వ్యూహం సిద్దం చేసుకొని ఆడాను. ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నానని శ్రీకాంత్‌ తెలి పారు. నిలకడగా పాయింట్లు రావడంతో నా వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ సీజన్‌లో మూడో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ సాధించినందుకు ఆనందంగాఉంది.

వచ్చే వారం ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడతాను. ఈ సీజన్‌లో మిగిలిన టోర్నీల్లోనూ ఇదే ఫామ్‌ను కొసాగించా లని అనుకుంటున్నానని శ్రీకాంత్‌ తెలిపారు. క్రెడిట్‌ మొత్తం శ్రీకాంత్‌ దే : గోపీచంద్‌ శ్రీకాంత్‌ వరుస సెట్లలో నెగ్గడాన్ని బట్టి ఈ గేమ్‌ చాలా తేలిగ్గా సాగిందని అనుకోవచ్చు. కానీ లీ చాలా కష్టమైన ప్రత్యర్థి. శ్రీకాంత్‌ అతడి బలహీనతలపై దెబ్బకొట్టాడు. లీ తిరిగి పుంజుకో కుండా శ్రీకాంత్‌ వరుసగా పాయింట్లు గెలవడం మీదే ధ్యాస పెట్టాడు. టైటిల్‌ విజయంలో క్రెడిట్‌ మొత్తం శ్రీకాంత్‌కే దక్కుతుంది. తొలి గేమ్‌ చివర్లో నేను శ్రీతో మాట్లాడా. లీ తిరిగి పుంజు కునే అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం అశ్రద్ధగా చేయకుండా జాగ్రత్తగా ఆడమని సూచించానని పుల్లెల గోపీచంద్‌ తెలిపారు.