సాహితీ సమరాంగనల చైతన్యపాత్ర

Writers
Writers

This slideshow requires JavaScript.

సాహితీ సమరాంగనల చైతన్యపాత్ర

హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్ల సందడే కనిపిస్తున్నది. నేటి నుంచి ఈనెల 19వ తేదీవరకు జరగనున్న ఈ సభలకు అతిరధ మహాపండితులు, సాహిత్యవేత్తలు, కవ్ఞలు, రచయితలు పాల్గొననున్నారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు అన్ని సాహితీ ప్రక్రియలకు వేదిక కానున్నాయి.

బృహత్‌ కవి సమ్మేళనం మొదలు సాహిత్య ప్రక్రియలపై చర్చా గోష్టులు, బాల సాహిత్యం, మహిళా సాహిత్యంపై చర్చా గోష్టులతో పాటు ప్రతీ రోజూ శాస్త్రీయ, సంగీత నృత్య ప్రదర్శనలు జరుగున్నాయి. ఇందుకోసం నిర్వాహకులు ఒక్కో అంశాన్ని నిర్వహించడానికి ఒక్కో వేదికను ఎంపిక చేశారు. ఒక్కో విడతలో 25 మంది కవితా పఠనం చేయనుండగా, అనుభవ జ్ఞులైన ఇద్దరు కవులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కవుల సంఖ్య పెరిగితే మరిన్ని విభాగాలుగా బృహత్‌ కవి సమ్మేళనాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తులో శతావధానం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బాల సాహిత్యం, మహిళా సాహిత్యంపై చర్చా గోష్టులు ఉంటాయి. అలాగే, శాస్త్రీయ, సంగీత నృత్య ప్రదర్శనలు, పత్రికా భాషపై సదస్సుఉంటాయి. అలాగే, ప్రాచీన తెలంగాణ-చరిత్ర, భాష -సంస్కృతులపై లలిత కళాతోరణంలో జానపదకళల ప్రదర్శనలు ఉంటాయి. తెలంగాణ సాంస్కృతిక పునర్వికాసోద్యమంలో పునాది పాత్ర పోషించింది గ్రంథాలయోద్యమం. ఈ గ్రంథాలయోద్యమానికి ప్రేరకం పత్రికోద్యమం. తెలంగాణలో పత్రికలు, పత్రికా రచనే గ్రంథాలయోద్యమానికి చేయూతనిచ్చాయి. ఈ గ్రంథాలయోద్యమాలు అటు రాజకీయ ఉద్యమాల్ని నిర్దేశించాయి. నడిపించాయి కూడా.

తెలుగుసాహిత్యంలో తెలుగుమహిళల పాత్ర కూడా ఎంతో ఉంది. సమాజంలో పట్టిపీడిస్తున్న సమస్యల్లో అత్యధికంగా మహిళా, బాలికల సమస్యలే ఉన్నాయి. అత్యాచారం, లైంగికవేధింపులు, గృహహింస, వెట్టిచాకిరీ, బాలికలపట్ల వివక్ష, వరకట్నవ్యధలు ఇలా ఎన్నో సమస్యలు దేశాభివృద్ధికి ఆటంకంగా పరిణమించినా, సమాజం దీన్ని పట్టించుకోలేదు.

అయితే కొంతమంది సంఘసంస్కర్తలు, మేధావ్ఞలు, మానవతావాదులు, స్త్రీలు తమ రచనల ద్వారా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై రచనల ద్వారా ప్రశ్నించడం ఆరంభించారు. ముప్పాల రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, అబ్బూరి ఛాయాదేవీ, సరస్వతి గోరా, తిన్నెటి హేమలత, అరుణకుమారిగల్లా, యద్దనపూడి సులోచనరాణి, ముదిగంటి సుజాతారెడ్డి, తురగా జానకీరాణి తదితరులున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వీరుకాక విద్యావతి, గోగుశ్యామల, జమ్మిలనిషాత్‌, సరోజినీనాయుడు, లక్ష్మీకాంతమ్మ వంటివారున్నారు. ప్రపంచ తెలుగు సభలు జరుగుతున్న తరుణంలో కొంతమంది మహిళా రచయితల గురించి తెలుసుకోవడం ఓ సందర్భం. ముదిగంటి సుజాతారెడ్డి నల్గొండలో జన్మించారు. సుజాత ఒకసారి నాగార్జున సాగర్‌ను దర్శించాను.

ఆ యాత్ర గురించి సుజాత చిన్న వ్యాసంగా రాసి, ఆంధ్రప్రభ ప్రమదావనం మాలతీ చందూర్‌కు పంపించారు. అది ప్రమదావనంలో అచ్చయింది. అప్పుడు ఆమె ఆనందానికి అవధుల్లేవ్ఞ. 1986వ సంవత్సరం నుంచి సుజాతారెడ్డి నవలలు, కథలు, సృజనాత్మక రచనలు చేయడం ఆరంభించారు. ‘మలుపు తిరిగిన రథ చక్రాలు అనే నవలను రాశారు. విప్లవ నవలలో ప్రేమ వ్ఞండటం, విప్లవవీరుడు ప్రజాస్వామ్యాన్ని కోరుకుని జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లుగా రాయడం కొందరికి నచ్చలేదు. జీవితంలో ప్రేమ ఒక భాగం. ఆ తర్వాత ‘ఆకాశంలో విభజన రేఖల్లేవ్ఞ అనే నవలను స్త్రీవాదంలో వచ్చే అతివాద ధోరణులను, పురుష ద్వేషాన్ని విమర్శిస్తూ ఈ నవలను సుజాతారెడ్డి రాశారు.

పాశ్చాత్యదేశాల్లో స్త్రీ స్వేచ్ఛకు సమలింగ సంపర్కం ఒక మార్గమని కూడా చెప్పిన గుంపు వ్ఞంది. దాన్ని వివర్శిస్తూ మంచి చెడు అనేవి స్త్రీలలో, పురుషులలో వ్ఞంటుందని చెప్తూ రాశారు. ‘విసుర్రాయి పేరుతో 1998లో చిన్నచిన్న కథల పుస్తకంగా ప్రచురించారు. ఈ కథలకు ప్రశంసలతోపాటు అవార్డులను సుజాత అందుకున్నారు. ‘విసుర్రాయి కథలన్నీ స్త్రీల సమస్యల గురించి రాసినవే. 2010లో ‘రసచర్చ ఆధునికత, ముసురు అనే పుస్తకాలను ప్రచురించారు. ‘ముసురు ఆమె ఆత్మకథ. తెలుగులో స్త్రీ ఆత్మ కథలను అరుదుగానే రాసారు. సుజాత సంస్కృతి సాహిత్య చరిత్ర, చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర పేరుతో పుస్తకాలను రాశారు.

ముప్పాల రంగనాయకమ్మ:
1939లో తాడేపల్లిగూడెంలోని బొమ్మిడి గ్రామంలో జన్మించిన రంగనాయకమ్మ తెలుగు సాహిత్యంలో స్త్రీవాద రచయితగా పాపులర్‌ అయ్యారు. పదోతరగతి పాసయ్యాక ఆమె ఉన్నత చదువ్ఞ చదవాలనుకున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువ్ఞ ముందుకు కొనసాగలేదు. మార్కిస్టు భావాలు గల రంగనాయకమ్మ చిన్నతనం ఉంచి స్త్రీలకు జరిగే అన్యాయాలను గమనించేవారు. 1955వ సంవత్సరం నుంచి ఆమె నవలలు, పుస్తకాలు, వ్యాసాలను రాయడం ఆరంభించారు. దాదాపు 15 నవలలు, 70 చిన్నపుస్తకాలు, పలు కథలను రాశారు. ఆమె రచనల్లో ప్రధానంగా కనిపించే అంశం ‘వివక్ష లేని సమానత్వం. బలిపీఠం, జానకీవిముక్తి, రచయిత్రి, కృష్ణవేణి, కూలిన గోడలు, స్వీట్‌హోమ్‌, స్త్రీ, చదువ్ఞకున్న కమల, రామాయణవిషవృక్షం వంటి పాపులర్‌ పుస్తకాలు ఆమె పేరును ఉన్నతంగా తీసుకెళ్లాయి.

యద్దనపూడి సులోచనారాణిఫ
కృష్ణజిల్లాలో జన్మించిన సులోచనారాణి 1970వ సంవత్సరం నుంచి మహిళా సమస్యలపై రచనలకు శ్రీకారం చుట్టారు. 1973వ సంవత్సరంలో మీన అనేపుస్తకం ఆమె మొదటి పుస్తకం. జీవనతరంగాలు పాపులర్‌ నవలతో పాటు ఆమె పాపులర్‌ రచయితగా కీర్తించబడ్డారు. అగ్నిపూలు, చండీప్రియ, ప్రేమలేఖలు, బంగారుకల, విజేత, ఆత్మగౌరవం, ప్రేమదీపిక, గిరిజాకళ్యాణం వంటి పుస్తకాలు కూడా ఆమెకు పేరుతెచ్చిపెట్టాయి. యద్దనపూడి సులోచనారాణి కథలు సినిమాలుగా కూడా వచ్చాయి. జాహ్నవి, జీవన, అనురాగ తోరణం, అవ్యక్తం, స్వప్నం, ప్రియశక్తి, ప్రేమ వంటి పలు నవలలు కూడా రాశారు.

ఓల్గా:
1950, నవంబరు 27వ తేదీన గుంటూరు జిల్లాలో జన్మించిన ఓల్గా అసలు పేరు పి.లలిత కుమారి. ఓల్గా అనేది ఆమె పెన్‌ నేమ్‌. 2015వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అవార్డును పొందిరు. ఉషాకిరణ్‌మూవిస్‌లో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసారు. ప్రస్తుతం అస్మిత రిసోర్స్‌ సెంటర్‌లో చైర్మన్‌గా పనిచేస్తున్నారు. 1986వ సంవత్సరంలో సహజ అనే నవలనను రాశారు. అయితే మొదట కవితలు ప్రచురించబడ్డాయి. 1987వ సంవత్సరంలో ‘స్వేచ్ఛ ప్రచురించబడ్డాయి. సహజ, స్వేచ్ఛ ఈ రెండు నవలలు స్త్రీకి పెళ్లి సంకెళ్లతో సమాన మని రాసారు. 1988లో ‘కన్నీటి కెరటాలు అనే నవలను రాశారు. మనవి, మీకు గోడలు లేవు. ఆకాశంలో సగం వంటి పాపులర్‌ నవలు ఓల్గా కలం నుంచి జాలువారిన పుస్తకాలే. ్సలం నుంచి జాలువారిన పుస్తకాలే.