సాహసాలు చేయటం నేర్చుకోవాలి

 

MODI
న్యూఢిల్లీ: బాలల తమ జీవన విధానంలో సాహసాలు చేయటం అలవర్చుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ జరిగిన బాలల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ సాహసబాలలకు పురస్కారం అందజేశారు. ఈసందర్భంగా మోడీ ప్రసంగిస్తూ, సమాజంలో విపత్కర పరిస్థితుల సమయంలో సాహసం చేసే అవకాశం రావచ్చని అన్నారు. వీరులు చేసే సాహసం ఎందరి ప్రాణాలో నిలబెడుతుందని పేర్కొన్నారు.