సావిత్రి గెటప్‌ అదుర్స్‌

KEERTI SURESH
KEERTI SURESH

సావిత్రి గెటప్‌ అదుర్స్‌

టాలీవుడ్‌లో అలనాటి అగ్రతార సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానాటి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..సావిత్రి పాత్రలో కీర్తిసురేష్‌ నటిస్తోంది.. అయితే ఆమె నిజజీవితంలో సావిత్రి పాత్రకు ఎంత వరకు సైట్‌ అవుతుందో అన్న సందేహం ప్రేక్షకుల్లో ఉంది.. ఆసందేహాలను పటాపంచలు చేస్తూ సావిత్రి లుక్‌లో ఉన్న కీర్తి సురేష్‌ఫొటోలు కొన్ని సోషల్‌ మీడియాలో బయటకు వచ్చాయి.. సావిత్రి గెటప్‌లో కీర్తి చూడ ముచ్చటగా ఉంది.. సావిత్రి పాత్రకు కీర్తి సరిగ్గా సరిపోయిందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.. సావిత్రి ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి ఎటువంటి లుక్‌ విడుదల కాలేదు..దీంతో కీర్తి సురేష్‌ గెటప్‌పై ఆసక్తి నెలకొంది.. ఈ నేపథ్యంలో మహానటి సెట్‌లో తీసిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి.. ప్రస్తుతం ఈఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.. ఈచిత్రంలో కీర్తిసురేష్‌తో పాటు సమంత, దుల్కర్‌ సల్మాన్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు.