సావాస దోషం

BRANCH

నారాయణ మంచివాడు బుద్ధిమంతుడు తెలివైన వాడు. రోజూ స్కూలుకి వచ్చి మాస్టార్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటాడు. వాళ్లిచ్చే హోంవర్క్‌ చేసుకు వస్తాడు. మాస్టార్లతో పాటు తోటి విద్యార్థులతో కూడా మంచిగా మర్యాదగా ఉంటాడు. అందువల్ల నారాయణ బడిలో అందరికి అభిమాన పాత్రుడయ్యాడు. అయితే కొంతకాలానికి నారాయణలో మార్పు వచ్చేసింది. స్కూలు ఎగ్గొడుతున్నాడు. అప్పుడప్పుడు స్కూలుకి వస్తున్నా మాస్టార్లు చెప్పే పాఠాలు వినకుండా తోటి విద్యార్థులను అకారణంగా తిట్టడం కొట్టడం చేస్తున్నాడు. వాడిలో వచ్చిన మార్పుకు విద్యార్థులతో పాటు మాస్టార్లు కూడా ఆశ్చర్యపోతు అంత మంచివాడు ఇంత చెడ్డగా ఎలా మారిపోయాడా అని ముక్కున వేలేసుకున్నారు, బాధపడ్డారు. ఆ తరువాత మంచిగ ఉండమంటు హితవ్ఞ చెప్పారు అయితే వారి హితోక్తులు నారాయణ ముందు చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే అయింది. ఆ తరువాత నారాయణ మరింత రెచ్చిపోయి మాస్టార్లనే ఆటపట్టిస్తు వారిని వేళాకోళం చేస్తూ నవ్వడం కూడా మొదలుపెట్టిడు. ఇక వాడి ఆగడాలు భరించలేక హెడ్మాస్టర్‌ వాడికి బాగా చివాట్లు పెట్టి టి.సి. ఇచ్చి పంపించి వెయ్యాలని చూసారు. అయితే నారాయణ అంటే ప్రత్యేక అభిమానంచూపించే శంకరం మాస్టారు కలుగచేసుకోవటంతో సమస్య అప్పటికి సమసిపోయింది. మొదట్లో బుద్ధిమంతుడిలా మంచి విద్యార్ధిలా ఉన్న నారాయణ ఇలా ఎందుకయ్యాడో ఎవరికి అర్ధం కాలేదు. వాడిని మంచివాడిలా మార్చాలనుకున్న శంకరం మాస్టారు నారాయణను పిలిచి అడిగాడు. నారాయణ నోరు విప్పలేదు. పదే పదే అడగటంతో చెప్పక తప్పలేదు నారాయణకి.మా ఇంటి దగ్గర మహేంద్ర అనే వాడు ఈ మధ్యనే వచ్చాడు. నాకు స్నేహితుడయ్యాడు. అయితే కోపంగా గద్దించారు శంకరం మాస్టారు అది… అది.. అని నసుగుతున్న నారాయణతో అలాగా నువ్వింకేమి చెప్పనక్కరలేదు. నాకంతా అర్ధమైపోయింది. వాడెవడితోనో స్నేహం చేసినందువల్ల నువ్ఞ్వ వాడిలానే తయారయాయవ్ఞ వాడి బుద్ధులు అలవాట్లు నీ క్కూడా వంటబట్టాయి అంతేనా అంటూ నారాయణ వైపు చూసారు అవ్ఞన్ననట్లుగా తల ఊఆడు వాడు. ఇది సావాస దోష ఫలితమన్నమాట. ఆరునెలలు సావాసం చేస్తే వారు వీరవ్ఞతారంటారు. ఇదే అంటూ నిట్టూర్చారు శంకరం మాస్టారు. అయితే ఆయన కృషి వల్ల నారాయణ కొద్దిరోజుల్లోనే మంచి వాడయి అందరి మన్ననలు పొందాడు.
– మిథునం, హైదరాబాద్‌