సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి ఎదురేలేదు

PM MODI
PM MODI

జాతీయ మండలి సమావేశంలోప్రధానిమోడీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి ఎదురేలేదని,ప్రతిపక్షాలు 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని సవాల్‌చేసే సామర్ధ్యమే లేదనిప్రధానినరేంద్రమోడీ పేర్కొన్నారు. ప్రతిపక్షాలుకేవలం అవాస్తవాలతో పోటీపడుతున్నాయని, అంశాలవారీగా కానేకాదని ఆయన అన్నారు. ఆనాడుప్రభుత్వంలో ఉన్నవారి వైఫల్యాలనే ఇపుడు కూడా అవే వైఫల్యాలను చూపిస్తున్నారనిప్రధాని వెల్లడించారు. 2019 ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సవాళ్లు తనకు కనిపించడంలేదని బిజెపి జాతీయ కార్యవర్గాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ పేర్కొన్నారు. బిజెపి సిద్ధాఆంతాలపైనే పోరాడుతుందని, పార్టీకి అబద్దాలపై పోరాడటం తెలియదని అన్నారు. రెండోరోజు సమావేశంలో ప్రధాని ప్రసంగం సమావేశాల వివరాలనున్యాయశాఖమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ మీడియాకు వివరించారు. ప్రతిపక్షాలన్నీ కలిసి నిర్మించిన మహాకూటమి, లేదా మహాఘటబంధన్‌ను మోడీ తిరస్కరించారని, వారి నాయకత్వమే గుర్తింపు కోల్పోయిందని, వారి విధానాలు అస్పష్టంగా ఉన్నాయని, వారి ప్రధాన వైఖఱి అవినీతితో కూడుకున్నదని మోడీ వెల్లడించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడుతూ బిజెపి 2019 సార్వత్రిక ఎన్నికలను గత ఐదేళ్లుగా తమ పార్టీ బలం, పనితీరు ఆధారంగానే పోటీచేస్తుందని, మహాకూటమి వల్ల భయమేమీలేదని అన్నారు. ప్రతిపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పాటవుతున్న తరుణంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు బిజెపి ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చర్చించేందుకు జాతీయకార్యవర్గ సమావేశం ఏర్పాటుచేసింది. అలాగే సార్వత్రిక ఎన్నికల వ్యూహంపై కూడావిస్తృత స్థాయి చర్చలుజరిగాయి. బిజెపి ఆధిపత్యాన్ని కట్టడిచేసేందుకు సమాజ్‌వాదిపార్టీ, బహుజన్‌సమాజ్‌పార్టీలు రెండూ కలిసి పోటీచేయాలనినిర్ణయించిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌ డస్సాల్ట్‌ ఏవియేషన్‌నుంచి కొనుగోలుచేస్తున్న రాఫెల్‌యుద్ధవిమానాల డీల్‌, ఆర్ధికవ్యవస్థ లోపభూయిష్ట యాజమాన్యం, విధివిధానాల అమలులో వైఫల్యం, 2016లో వచ్చిన పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి వంటి వాటినే ప్రధాన అస్త్రాలుగా చేస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వీటినే ప్రధాన అస్త్రాలుగా మలుచుకుంది. రానున్న ఎన్నికలకు కూడా వీటినే తిరిగి ఎక్కుపెడుతుందని చెప్పవచ్చు.