సార్వత్రిక ఎన్నికల్లో చెరిసగం సీట్లు

NITISH- AMIT SHAW
NITISH- AMIT SHAW

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి, జెడియు రెండుపార్టీలకు బీహార్‌ రాష్ట్రంలో చెరిసగం సీట్లు కేటాయింపు ఉంటుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు. రానున్న రోజుల్లోనే ఈ సీట్ల వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మీడియా సమావేశంలో అమిత్‌సా మాట్లాడుతూ బిజెపి, జెడియులు రెండూ కూడా సమానస్థానాల్లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తాయనివెల్లడించారు. ఇతరమిత్రపక్షాలు సైతం గౌరవప్రదమైన సీట్లను దక్కించుకుంటాయనిఅన్నారు. సంఖ్యావివరాలను సత్వరమే వెల్లడిస్తామని చెప్పారు. బీహార్‌లో ప్రస్తుతం బిజెపి, జెడియు ప్రభుత్వాలు సంకీర్ణ ప్రభుత్వంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలకుగానున ఇప్పటినుంచే ఈ రెండు పార్టీలు పరస్పరం చర్చలు కొనసాగిస్తున్నాయి. ఈనేపథ్యంలో అమిత్‌సా, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌లు ఇరువురూ కలిసినమీడియా సమావేశంలోనే ఈ వివరాలను వెల్లడించారు. బీహార్‌లో రానున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రతిపక్షాలన్నీ ఐక్యకూటమిగా బిజెపిని ఎదుర్కొంటాయని ప్రకటించిన నేపథ్యంలో బిజెపి, జెడియులు చురుకుగా వ్యూహాలు అమలుచేస్తున్నాయి. అంతకుముందు ఆర్‌ఎల్‌ఎస్‌పికి చెందిన ఉపేంద్ర కుష్వాహా బిజెపి సీట్ల పంపకంపై తీవ్ర అసంతృప్తిని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటికితోడు ముందురోజే బీహార్‌లో ప్రతిపక్ష ఐక్యతను చాటిచెప్పేందుకన్నట్లుగా సిపిఐ, కాంగ్రెెస్‌, సిపిఎం, ఎన్‌సిపి, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌లు పెద్ద ఎత్తున బలప్రదర్శన చేయడంతో మిత్రపక్షాలైన బిజెపి,జెడియు రెండూ తమతమ సమీకరణాలు బేరీజువేసుకుంటున్నాయి.