సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డిఏకు తగ్గనున్న మెజారీటీ…

BJP
BJP

యూపిలో బిజెపికి బాగా తగ్గిపోనున్న సీట్లు…
ఎబిపి-సి ఓటర్‌ సర్వే వెల్లడి…
న్యూఢిల్లీ: ఎన్‌డిఏ ప్రభుత్వానికి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గడ్డుకాలమే కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తే బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏ మెజారిటీని స్వల్ఫంగా కోల్పోనుందని ఒక సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే హంగ్‌ పార్లమెంట్‌ వస్తుందని సర్వే తెలిపింది. ఎబిపి-సిఓటర్‌ సర్వేలో ఎన్‌డిఏ ప్రభుత్వం ఏర్పాటుకి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 272కి దరిదాపుల్లోకి రాదని తెలిపింది. ఈ సర్వే ప్రకారం ఎన్‌డిఏ 233 సీట్లు మాత్రమే గెలుస్తుంది. 2014లో పోలిస్తే భారీగా 103 సీట్లు కోల్పోనుంది.కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపిఏ భారీగా పుంజుకోనున్నట్లు ఈసర్వే అంచనా వేసింది. యూపిఏ కూటమి 167 సీట్లు గెలుచుకోనుందని తెలిపింది. 2014 ఎన్నికలతో పోలిస్తే యూపిఏ బలం అమాంతం 108 సీట్లు పెరగనుందని, ఇక ఎన్‌డిఏ, యూపిఏ కూటమములలో లేని పార్టీలు 143 సీట్లలో నెగ్గుతాయని ఆసర్వే తెలిపింది. బిజెపి ఒంటరిగా 203 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్‌ ఒంటరిగా 109 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. ఎన్‌డిఏకు వైఎస్‌ఆర్‌సిపి, ఎంఎన్‌ఎఫ్‌, టిఆర్‌ఎస్‌ సపోర్ట్‌ చేస్తే ఎన్‌డిఏ సీట్లు 278కి పెరిగే అవకాశం ఉందని సర్వే తెలిపింది. యూపిఏకు ఏఐయుడిఎఫ్‌, ఎల్‌డిఎఫ్‌, టిఎంసి సపోర్ట్‌తో పాటు ఎస్‌పి,బిఎస్‌పి,ఆర్‌ఎల్‌డి సపోర్ట్‌ చేస్తే యూపిఏ 257 సీట్లు సాధించే అవకాశం ఉందని సర్వే తెలిపింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలిసిన ఈ సర్వే ఫలితాలు కచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాలకు ఆందోళన కలిగించేవే. సాధారణ ఎన్నికలు ఏప్రిల్‌ నెలలో జరగవచ్చు. మే కల్లా ఫలితాలు వెల్లడవుతాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా 44 సీట్లకు పరిమితమైన రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పునరుజ్జీవనానికి ప్రయత్నిస్తోంది.
యూపిలో బాగా తగ్గిపోనున్న సీట్లు…
ఇక ఉత్తర ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్‌ తప్పదని ఈ సర్వే వెల్లడించింది. ఈసర్వేలు బిజెపికి యూపిలో 25 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఎస్‌పి,బిఎస్‌పి, రాష్ట్రీయ లోక్‌దళ్‌ నేతృత్వంలోని కూటమికి 51సీట్లు వస్తాయని తెలిపింది. అదే జరిగింతే 2014 ఎన్నికంటే బిజెపికి ఇక్కడ 48సీట్లు తక్కువ రానున్నాయి. అప్పుడు బిజెపికి 73సీట్లు గెలుచుకుంది. గత ఏడాది డిసెంబర్‌లో చేసిన సర్వేలో బిజెపికి 36 సీట్లు వస్తాయని తేలింది. యూపిలో ఓటు షేర్‌ విషయంలో బిజెపికి బాగానే ఉంది. కూటమికి 43శాతం ఓట్లు, ఎన్‌డిఏకు 42శాతం ఓట్లు పడతాయని తేలింది. అయితే, బుధవారం ప్రియాంక గాంధీని యూపి ఈస్ట్‌కు ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ సర్వే అంతకుముందు చేసింది. ఇప్పుడు ప్రియాకం గాంధీ ఎంటర్‌ కావడంతో కొంత తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.