సాయుధ దళాలు సిద్దంగా ఉన్నాయిః అరుణ్‌జైట్లీ

ఢిల్లీః ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనడానికి సాయుధ దళాలు పూర్తి సన్నద్ధతతో ఉన్నాయని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. లోక్‌సభలో జైట్లీ మాట్లాడుతూ కాగ్ నివేదికలో ఆయుధాల సరఫరాకు సంబంధించి పేర్కొన్న అంశం ఒక నిర్దిష్ట కాల పరిమితికి సంబంధించి చేసిన వ్యాఖ్యలేనని ఆయన చెప్పారు. ఆయుధాలు, మందుగుండును త్వరలో భర్తీ చేయనున్నామని ఆయన అన్నారు.