సాయి దివ్యరూపం

                  సాయి దివ్యరూపం

Shirdi Saibaba
Shirdi Saibaba

సాయిబాబాను గురువ్ఞగా కొందరు భావిస్తారు. మరికొందరు కోరికలు తీర్చే కల్పవృక్షంగాను, కామధేనువ్ఞగాను, చింతామణిగాను భావిస్తారు. మరికొందరు తల్లిగా భావిస్తారు. పురుషరూపంలో నున్నా, దైవాలను, మాతృదేవిగా భావించటం, అలా కీర్తించటం జరుగుతుంటుంది. సాయిబాబా కూడా అందుకు కాదనడు. ఎవరి తల్లివారికి అందంగానే కన్పిస్తుంది. సాయిని కొందరు మాతృభావనతో చూడకున్నా, వారికి సాయి తన మధుర మనోహర రూపాన్ని చూపుతారు.

సాయి రూపాన్ని నలుగురూ అదే సమయంలో చూచినా, ఆ సౌందర్య దర్శనం అందరికీ దక్కదు ఒకే సమయంలో. సాయి సౌందర్యాన్ని చూచిన వారిలో ఒకడు అమరావతికి చెందిన గణేశ్‌ శ్రీకృష్ణకపర్దే. నిశ్చలంగా, నిర్మలంగా, గంభీరంగా ఉండే సాయి చూపు మధుర మందహాసం అందిస్తుంది. ఇంకా మాయలోనే ఉన్నారా? మాయను చీల్చుకునిపో అని సందేశమిస్తున్నట్లు ఉంటుంది ఆయన చూపు. సాయి కన్నులు కారుణ్యాన్ని కురిపిస్తుంటాయి.

సాయిని వీక్షించే సమయంలో ఏవీ జ్ఞప్తికి రావ్ఞ. కాకాజీవైద్య సప్తశృంగి దేవత ఆరాధకుడు, ఆ ఆలయ పూజారి కూడా. ఒకసారి ఆయనను పెక్కు సమస్యలు చూట్టుముట్టాయి. ఇక మానసిక సమతుల్యం దెబ్బతిన్నది. ఏదో ఆవేదన, ఏదో అశాంతి. పరిష్కారమార్గం కోసం ఆయన తీవ్రంగా అన్వేషించాడు. విఫలుడయ్యాడు. ఎంతో కాలం నుండి తనకు సేవ చేస్తున్న వ్యక్తిని ఆ సప్తశృంగిదేవత మరువరు కదా. ఆమె ఒకసారి స్వప్నంలో కాకాజీవైద్యకు సూచననిచ్చింది.

అతడు అర్ధం చేసుకొనలేకపోయాడు. మరల ఆ దేవత సూచన నిచ్చింది. కాకాజీవైద్య షిరిడీ చేరాడు. సాయినాధుని దర్శించాడు. సాయి సచ్చరిత రచయిత ఆ ఇద్దరు సమాగమమును గూర్చి వర్ణిస్తారు. అదే చదివేవారికి కన్నుల పండుగగా ఉంటుంది. కాకాజీ చిత్తంలో చిన్మయజ్యోతులు వెలిగాయి. మనోచాంచల్యం వినాశనమయింది. ఆ ఇద్దరూ ఒక్కమాట కూడా మాట్లాడుకో లేదు. ఇదే సాయి రూపదర్శన ఫలం అనవచ్చు.

ఈ సందర్శ న ఫలం అనేది సాయిబాబా షిరిడీలో సజీవంగా సశరీరంతో ఉన్న కాలానికే పరిమితం కాదు. ఎందుకంటే సాయిబాబాయే స్వయంగా అనేకసార్లు చెప్పారు. తనకు తన చిత్రానికి తేడాయే లేదని, న్యాయవాది ధూరూల్‌ సాయి చిత్రాన్ని తానుపోయిన ప్రతిచోటుకు తీసుకోపోయేవాడు. సాయి అతని వెంట ఉన్నట్లే కాని ఫొటో లేదా చిత్రము వెంట వ్ఞన్నట్లు కాదు. ఆయన సాయి చిత్రంలో అనేక అనుభూతులు పొందాడు. సాయిబాబా స్వయంగా ఇలా తెలిపాడు.

‘అత్యంత ఆనందకరమైన నా స్వరూపాన్ని తెలుసుకోవాలి. దానినే నిత్యమూ ధ్యానిస్తుండాలి. లేదా నాసగుణసాకార రూపాన్ని గుర్తు తెచ్చుకుని, నఖశిఖ పర్యంతం నన్ను రాత్రింబవళ్లు మనసులో పెట్టుకోవాలి సాయి నాధుని మధురమందహాస వదనారవిం దాన్ని చూస్తుంటే బ్రహ్మ నందంతో తనువెల్లా పరవశిస్తుంది. అట్టి మధురాను భూతి అందరూ పొందగలరు. రాముడేకాదు. సాయిబాబా కూడా జగదానందకారకుడు కూడా!
– యం.పి.సాయినాథ్‌