సాయి దయ

SAIBABA
SAIBABA

సాయి దయ

సాయి వంటి అసమాన్యులు కూడా జీవితాన్ని సామాన్యంగానే ప్రారంభిస్తారు. చివరకు దైవం, కులదైవాల స్థాయికి చేరుకుంటారు. మతీరాం మిశ్రా కూడా అంతే. ఆయన చురుకైన విద్యార్థి. ఉపనయనమయింది 9వ ఏట. 12వ ఏట వివాహం అయింది. 18వ ఏట ఆయనకు కుమారుడు జన్మించాడు. యువకునిగా, కుమారునిగా, భర్తగా, తండ్రిగా తన వంతు కర్తవ్యాన్ని తీర్చుకున్నానని తలచాడు. 18వ ఏటనే సత్యాన్వేషణకై ఎవరికీ చెప్పకుండా సంసారాన్ని వదలి వెళ్లిపోయాడు. శాస్త్రాధ్యయనం చేశాడు శిష్యునిగా చేరి. ఉజ్జయినికి చెందిన పరమహంస పరమానంద స్వామి ఆయనకు సన్యాసదీక్షనిచ్చాడు-మతీరాం మిశ్రా భాస్కరానంద సరస్వతి అయ్యాడు. భిక్షాటనతో పాటు భారతదేశ పర్యటనను కూడా చేశాడు. ఒకసారి తన తల్లితండ్రులను, భార్యను, కుమారుని చూడటం తటస్థించింది. మనసు చలించలేదు.

కొంతకాలానికి కుమారుని మరణవార్త వినటం జరిగింది. అప్పుడూ అంతే. కష్టసుఖాలు ఆయనకు లేవ్ఞ. దేశపర్యటన అనంతరం వారణాశి(కాశీ)లో స్థిరపడ్డాడు. కాశీ మహారాజు ఆయనకు దుర్గాకుండు వద్ద ఆనందబాగును ఇచ్చాడు. ఇక అక్కడే ఆయన నివాసం. ఆయనను దర్శించేందుకు ఎందరో వచ్చేవారు ప్రతిదినం. విదేశీయులు కూడా వచ్చేవారు ఆయనను దర్శించటానికి. ఆయన మహాసమాధి చెందక పూర్వమే, భారతదేశంలో ఆయన ఫొటోలు, బొమ్మలు(విగ్రహాలు) విపరీతంగా అమ్ముడుపోయేయి. మహారాజులు, మహారాణులు, ప్రభుత్వోన్నతోద్యోగులు ఎందరో దర్శించేవారు. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత మార్క్‌ట్వైన్‌ ఆయనను దర్శించాడు. సజీవ దైవమేనని ఆయనను శ్లాఘించాడు. పరిపూర్ణతకు, స్వచ్ఛతకు ఆయన మారుపేరు. ఈ ప్రపంచం ఆయనను కదిలించలేకపోయింది. ఆయన దిగంబరి.

అయినా ఉత్తమ సంస్కారవంతుడు. విదేశీయులు ఆయనను దర్శించేటప్పుడు ఒక వస్త్రాన్ని కప్పుకునేవాడు. బ్రహ్మజ్ఞాని. నిరంతరం సర్వజనహితం కొరకు ప్రయత్నించే సాధనాపరుడు. మహారాజులు, విఖ్యాత విదేశీయులు ఆయనను దర్శించినా ఏమీ కోరేవాడు కాడు. ఎవరో బంగారు బిళ్లను ఇస్తే, వెంటనే దగ్గర నున్న వారికి ఇచ్చివేశాడు. ఈయన నడవడిని సాయికి అంకితభక్తుడైన రామచంద్ర ఆత్మారాం తర్కడ్‌ కొనియాడాడు. ఆయన సాయివలె మూఢనమ్మకాలను ఖండించేవాడు. మతం అంటే ఒక అటక. దానిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. లేకుంటే సాలెగూళ్లు, చెదలు, ఎలుకలు పాడుచేస్తాయి. అంటే మతంలో ఛాందస భావాలను రానీయకుండా చూసుకోవాలి. నిరీక్షణ ఆయన ఎల్లప్పుడు నిరీక్షిస్తున్నట్లుండేవారు. ఆ ఘటనా ఘటనుడు ఆయన. విధిని కూడా మార్చగల సత్తా ఉన్నవాడు.

ఆయనవద్దకు ఒక ఉన్నత న్యాయాధికారి, ఆయన తల్లి వచ్చారు. వారు ఆయన భక్తులే. ఆ తల్లి భాస్కరానంద సరస్వతి పాదాలపై పడి వెక్కివెక్కి ఏడ్వసాగింది. కారణం అడిగాడు భాస్కరానందుడు. తన మనుమనికి జీవితకాలం (ఆయుష్షు) 17ఏండ్లేనని, ఆ ఆయువ్ఞ త్వరలో చెల్లిపోతుందని తెలిపింది. కాపాడమని పరిపరి విధాల ప్రార్థించిందామె. కన్నీటికి కరగని మహనీయు డుండడు. ఆయన భరోసా ఇచ్చారు. ”నేను జీవించి ఉన్నంత కాలం అతడు జీవించి ఉంటాడు అని తెలిపారు భాస్కరానందులు. భాస్కరానందులకు పరిపరివిధాల ధన్యవాదాలు తెలిపి, సెలవ్ఞ తీసుకొని పోయారు వారు. భాస్కరానందులకు కలరా సోకింది. ప్రభుత్వ ఉన్నత వైద్యులు, రాజులు, మహారాజులు, కొందరు విదేశీయులు ఆయన చుట్టూ చేరారు. ఆయన నిరీక్షణ ఫలించింది. ఆయన ఆత్మను పరమాత్మలో లీనం చేసేందుకు, మృత్యుదేవత వచిచంది. ఆయన కన్నుమూసారు. అదే సమయంలో ఉన్నతన్యాయాధికారి కుమారుడు, స్వారీ చేస్తూ, గుర్రంపై నుండి పడి తక్షణం మరణించాడు. భాస్కరానందులు తన ఆయువ్ఞలో కొంత ఆయువ్ఞను న్యాయాధికారి కుమారునికి బదిలీ చేశాడు. ఆయన మహాసమాధి కాశీలోని దుర్గాకుండ్‌ వద్ద ఉన్నది. ఆయన సమాధి దినం 9.7.1899 సుమారు. కోర్కెలు లేకుండా ఎలా జీవించాలో భాస్కరానందుల జీవితం తెల్పుతుంది.

– యం.పి. సాయినాథ్‌