సాయినాధుని దక్షిణ హస్తం

Shirdi Saibaba
Shirdi Saibaba

సాయినాధుని దక్షిణ హస్తం

ప్రపంచవ్యాప్తంగా నేడు రామకృష్ణపరమహంస గూర్చి తెలియని దేశం లేదు, తెలియని వారు లేరు. అలాగే సాయిబాబా కూడా. శ్రీరామకృష్ణ పరమహంస ధర్మోద్దరణకు వివేకానందుని ఎన్నుకొనెను. అలాగే సాయిబాబా కూడా శ్రీ బి.వి.నరసింహస్వామిని ఎన్నుకొన్నారు. రామకృష్ణుడు ఇవేకానందుని ఎన్నుకొనినప్పుడు వివేకానందుని జీవితం బాధాకరంగా ఉండేది. తండ్రి మరణం, మాతా సోదరుల పోషణభారం, భగవంతుని ఉనికిని ప్రశ్నించుటకు హేతువ్ఞలయ్యాయి. నరసింహస్వామి జీవితం కూడా అంతే. ఒకే సమయంలో ఇద్దరు బిడ్డల మరణం స్వామిని కలచివేసాయి. జీవితమనగా దుఃఖమా అనే భావం ఆయనలో పాతుకుపోయాయి. సత్యానేషణకై నిశ్చయించుకున్నారాయన. ఆస్తి అంతటిని భార్యకు, సంతానమునకు రాసి తాను ఆకాశమార్గమునందలి పక్షియైనాడు. మనశ్శాంతికి తిరువణ్ణామలైలోని రమణమహర్షులను ఆశ్రయించారు. రమణుల ఆదేశంతో కొన్ని సంవత్సరాలు మౌనాన్ని పాటించారు. రమణమహర్షి ఆదేశంతో సద్గురువద్దకు బయలుదేరారు.

ఆ అన్వేషణలో ఎన్నో అనుభవాలు కలిగాయి కానీ ఫలితం లేదు. ఏ పక్షి అయినా తన గూటికి మాత్రమే చేరుకుంటుంది. ఇతర గూళ్లు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. చివరకు సాయిబాబా ఆ పిచ్చుక కాలికి దారముకట్టి, షిర్డికి లాగుకొనినారు. ఇక అన్వేషణ పూర్తయింది. నరసింహస్వామి జీవితంలోనే కాదు, సాయిబాబా జీవిత చరిత్రలో నూతన అధ్యాయం మొదలైనది. అటు వివేకానందులకు, ఇటు నరసింహస్వామికి అందిన సంపదకి అంతులేదు. కోట్లకుకోట్లు ఆధ్యాత్మిక సంపద వారికైవసమయ్యింది. అటు తరగని సంపద ఒక్కరివద్దనే నిక్షిప్తమగుట వారిరువ్ఞరకు సమ్మతికానిది. వివేకానందులు, నరసింహస్వామియు రామకృష్ణుల, సాయినాధుల నిధికి వారసులైనారు.

ఆ నిధికి అందరూను వారసులే. ఈ సత్యము గ్రహించిన ఆ ఇరువ్ఞరులో కొత్తర పురుషులే. ఆనాడు సాయిబాబా మహారాష్ట్రకే పరిమితం. సూర్యునిగాని, చంద్రునిగాని ఏ ఒక్క ప్రదేశమునకు పరిమితం కాదుకదా. ఈ విషయాన్ని నరసింహస్వామి గ్రహించాడు. సాయి భక్తిని, సాయి తత్వాన్ని మహారాష్ట్ర నుండి బయటకు తెచ్చారాయన. ఆయన సాయినాధుని దక్షిణహస్తమయినాడని శ్రీ బొమ్మకంటి సుబ్బారావ్ఞ చమత్కరించారు. దక్షిణహస్తం అనగానే కుడిభుజం అని తెలుస్తుంది. నిన్నమొన్న శారీరకంగా, భౌతికంగా దేహాన్ని విసర్జించిన సాయినాధుని తత్వప్రచారాన్ని చేయటంలో స్వామీజి కుడిభుజమే అయినా ఈయన స్వయంగా ఎన్నో రచనలు చేశారు. అటు ఆంగ్లంలోను, ఇటు తమిళంలోను. సాయినాధుని దక్షిణహస్తాన్ని గూర్చి తెలపటం ఆయనే చేశారు. కేవలం మహారాష్ట్రకే పరిమితమయిన సాయిని, భారతదేశం ఇలవేల్పుగా చేశారు. నిద్రాహారాలు మాని సాయి తత్వాన్ని, మహత్తును అందరకూ, ఎన్నో దూరప్రాంతాలకు వెళ్లి తెలియ చెప్పిన ఘనత నరసింహస్వామిదే.

సాయినాధ వేదవాణిని మన ఇంటి గుమ్మం ముందుకు తెచ్చి పెట్టారాయన. అశాశ్వత బంధనాలకు ప్రాముఖ్యత ఇవ్వవద్దు, అహంకార రహితమైన ప్రేమను పెంచండి, పంచండి అనే సాయి తత్వాన్ని, ఆయన (నరసింహస్వామి) ఆచరించి ఇతరులకు తెలిపారు. తన జీవితాన్ని సాయి తత్వానికి బోధనలకు ఉదాహరణగా చేసుకున్న శ్రీ చీ.వి.నరసింహస్వామి 19 అక్టోబరు, 1956న సాయిలో ఐక్యమయ్యారు. అంటే నేడు ఆయన వర్ధంతి. ఓం శ్రీ సాయి నాధాయనమః

– యం.పి.సాయినాధ్‌