సామాజిక సేవలో తారలు

This slideshow requires JavaScript.

సామాజిక సేవలో తారలు

అందాల రాశుల్లో అగ్రభాగాన ఉన్నదెవరు? అని తెలుసుకోవడం ఫ్యాషన్‌ మేగజేన్లు తరచూ చేసే పనే. ప్రఖ్యాత ‘వ్యానిటీ ఫెయిర్‌ ఆ మధ్య అలాంటి ప్రయత్నమే చేసింది. అందం, ఆకర్షణలో ముందున్న పందొమ్మిది మందిని ఎంపిక చేసి వారిలో అత్యుత్తములెవరో నిర్ణయించమని పాఠకులను కోరింది. వారిలో వివిధ దేశాలకు చెందిన మోడళ్లు, నటీమణులు, రాణీవాసపు రమణులు ఉన్నారు. నేపథ్యాలు, చదువ్ఞలు, పెరిగిన పరిస్థితులు విభిన్నమైనవి. అయితేనేం, పాఠకులు తెలివిగా ఓటేశారు.
ఓటింగ్‌ ముగిశాక గమనిస్తే అందంలోనే కాక ఆపన్నుల సాయంలోనూ చురుగ్గా ఉన్నవారు ముందు నిలిచారు. సేవకూసై అంటున్న వారే. ఏంజెలనా జోలి, గిసెల్‌ బండ్చన్‌, జోర్డాన్‌ రాణి రానియా. వీరంతా ఏటి యువతకు ఆదర్శనీ యంగా నిలబడ్డారు. ఏంజెలినా ఆదర్శం ఒంటిమీద పదమూడు పచ్చబొట్లు పొడిపించుకున్న ఏంజెలినా జోలీ కుర్రకారుకి కలలరాణి. హాలీవ్ఞడ్‌ ప్రముఖ శృంగార నాయకి. అంతమాత్రాన ఆమే ప్రపంచ సుందరీమణుల పోటీలో విజేతను చేశాయా? అంటే అవ్ఞననలేం. ముప్పై మూడేళ్ల ఆమె జీవితాన్ని గమనిస్తే అభాగ్యులకు ఆసరాగా నిలిచిన సందర్భాలు అనేకం. అందాల ప్రదర్శన కన్నా ఆపన్నుల సేవకే అధిక మార్కులు పడతాయి. సేవా రంగంలో ఆమె కృషికి పదేళ్ల వయసు. ఐరాసతో సహా అనేక అంతర్జాతీయ సంస్థలతో ఆమె కలిసి పనిచేస్తోంది. అంతెందుకు? అనాథ బాలల దత్తత ఓ ఉద్యమంలా వ్యాపిస్తోందంటే అది ఆమె చలవే. అనేక ఆటుపోట్లతో పైకెదిగిన ఏంజెలినా బాధ్యతలు, బంధాల్లో సేద తీరాలనుకుంటుంది. అమెరికాలో జన్మించిన ఆమెకు ఏడాది వయసున్నప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి, సోదరుడితో కలిసి సాధారణ జీవితం గడిపింది. అడుగడుగునా అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు. వాటిని భరించలేక చేతిమీద పిన్నీసులతో గుచ్చుకునేది. మోడలింగ్‌, నాటక రంగంలో అడుగుపెట్టిన ఆమె క్యాట్‌వాక్‌లో కనీస మార్కులు పొందలేకపోయింది. అయితే సినిమా రంగంలో అవకాశాలు సంపాదించింది. సైబోర్గ్‌2లో సైలెంట్‌గా ప్రవేశించిన ఆమె 2001లో ‘లారాక్రాఫ్ట్‌ టోంబ్‌రైడర్‌తో తళుక్కుమంది. ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించింది.
ఈ సినిమా షూటింగ్‌ జరుతున్నప్పుడే కాంబోడియాలో ఆకలితో అలమటిస్తున్న చిన్నారులు కంటపడ్డారు. ఏంజెలినా కదిలిపోయింది. యుద్ధం, క్షామం, తీవ్రవాదం బారిన పడి సమస్యల సుడిగుండాల్లా మారిన ప్రాంతాలు, ప్రజల దుర్భర పరిస్థితుల గురించి అధ్యయనం చేసింది. ఐరాస ప్రతినిధిగా టాంజానియా, సియెర్రాలియోన్‌తో సహా ఇరవై దేశాలను సందర్శించింది. ‘నిర్భాగ్యులు, నిరాశ్రయులు లక్షల సంఖ్యలో ఉన్నారన్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. వారికి సాయపడాలి అనే ఏంజెలినా తన పర్యటనలకయ్యే ఖర్చుని తానే చెల్లిస్తుంది. ఆఫ్గాన్‌ నిరాశ్రయుల కోసం లక్షల డాలర్ల విరాళం ప్రకటించింది. స్వయంగా ముగ్గురు పిల్లలకు తల్లయిన ఆమె మరో ముగ్గురిని దత్తత తీసుకుంది. ‘స్లమ్‌గాగ్‌ మిలియనీర్‌లో పేద కుర్రాడు అజహర్‌ని దత్తత తీసుకోవాలనుకుంటోంది. ఎన్నో అవార్డులందుకున్న ఏంజెలినాకు ‘వ్యానిటీ ఫెయిర్‌ గుర్తింపు పాఠకుల తాజా అభినందన. పేదరిక నిర్మూలనలో రానియా ఎంబిఎ పూర్తి చేసి ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ అమ్మాయికి జోర్డాన్‌ రాజుతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమకి, పెళ్లికి దారి తీసింది.
ఎర్ర తివాచీల మీద నడుస్తూ చలువరాతి మేడల్లోకి అడుగుపెట్టి పట్టుపరువ్ఞ లపై విశ్రమించిన ఆమె రాణిగా అజమాయిషీ చేయలేదు. కఠిన శాసనాలతో ప్రజల్ని కంగారెత్తించలేదు. ‘కమాన్‌ రండి అందరం కలిసి అభివృద్ధి దిశగా నడుద్దాం అంటూ పిలుపునిచ్చింది. మహిళలు, శిశుసంక్షేమానికి ప్రాధాన్య మిచ్చింది. ఆమే జోర్డాన్‌ రాణి రానియా. పదేళ్ల క్రితం జోర్డాన్‌ రాణిగా ప్రమాణం చేసిన రానియా నాటినుంచి ప్రజల పక్షమే. సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. మహిళల సమస్యలను ఎలుగెత్తి చాటే శంఖారావం అయింది. చిన్నారుల విద్యకు ప్రాధాన్యమిస్తూ పాఠశాలలు ఏర్పాటు, వసతులపై దృష్టి నిలిపింది. ఆంగ్ల విద్యను తప్పనిసరి చేసింది. వృత్తి విద్యలను ప్రోత్సహించింది. చిన్న పిల్లల టీకాలు, ఆరోగ్యం కోసం శ్రద్ధ పెట్టింది. సూక్ష్మ రుణ పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేసింది. ఓపెరా విన్‌ఫ్రే షోలో పాల్గొన్న ఆమె ఇస్లాంపై నున్న దురభిప్రాయాలను పటాపంచలు చేస్తూ మాట్లాడింది. అదేసమయంలో నిర్భంద బుర్ఖా విధానాన్ని వ్యతిరేకించింది. మిలీనియంలో ప్రపంచ నేతలు పేదరిక నిర్మూలనకు ప్రకటించిన విధానాలను ఇంకా ఎందుకు అమలు చేయడం లేదో తెలపాలని డిమాండ్‌ చేసింది. రంగుల ప్రపంచం, ఫ్యాషన్లు ఆమెకు ఏమాత్రం సంబంధంలేని విషయాలు. అయిప్పటికీ 2005లో హార్పర్స్‌ పత్రిక ప్రపంచంలోని మూడో సౌందర్యరాశిగా రానియాను ప్రస్తుతించింది. దేహమే కాదు, మనసూ అందమైనదే. సేవలోనూ సూపర్‌ సాయం ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురు, సంపన్నుల జాబితాలను రూపొందించే ‘ఫోర్బ్స్‌ పేరు విన్నారు కదూ! ఆ పత్రిక ప్రపంచంలోని సంపన్న మోడళ్లలో నంబర్‌వన్‌, వినోద రంగంలోని ధనవంతుల్లో పదహారో స్థానం ఓ అమ్మాయికి కేటాయించింది. అత్యధికంగా ఆస్తిపాస్తులున్న మోడల్‌గా గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే ప్రముఖ మోడల్‌ గిసెలె బండ్చన్‌. పేరు చిత్రంగానే ఉంటుంది.
పరు చిత్రంగానే ఉంటుంది. బ్రెజిల్‌ భామ కదా! అయితే ఈమె పరిచయానికి మరో మార్గముంది. టైటానిక్‌ హీరో డికాప్రియో ఈమె మాజీ ప్రియుడు. గిసెలె అంటే చాలు గిలగిల్లాడి పోతాడు. అంత అందం ఆమెది! అందుకే ఐదువందల సార్లు ప్రముఖ ఫ్యాషన్‌ పత్రికల ముఖ చిత్రాలపై కనిపించింది. అలాగని ఏంజెలినా తరువాత అందగత్తెగా ఓట్లు పడటానికి అవే కారణం కాదు. గిసెలె రెండు పదుల వయసు నుంచే సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచు కుంటోంది. 2003లో బ్రెజిల్‌ అధ్యక్షుడు ఆరంభించిన జీరో హంగర్‌ కార్యక్రమానికి ఆమె ప్రచార కర్త. ఆర్థిక సాయమూ అందించింది. ఆ మరుసటేడు అటవీ, వన్యమృగాల సంరక్షణకు ఉద్య మించింది. 2006లో కేన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి, ఈసంవత్సరం ఆరంభంలో హరికేన్‌ కత్రినా బాధితుల సాయానికి సహకరించింది.