సామాజిక మార్గంలో సాగే సాహితీ మేధావి

తెలంగాణ సాహితీ సౌరభాలు
               సామాజిక మార్గంలో సాగే సాహితీ మేధావి

CHUKKA RAMAIAH
CHUKKA RAMAIAH

నదేశంలో, ప్రత్యేకించి మన రాష్ట్రంలో విద్యారంగం తో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంతో ఇంతో సంబంధం ఉన్న చాలా మందికి చుక్కారామయ్య గారి పేరు తెలుసు. కానీ ఐఐటి రామయ్య గారు అంటే ఇంకా చాలా చాలా మందికి తెలుసు. ఇరవయ్యొకటవో శతాబ్ది రెండవ దశకంలో ప్రారంభమైన ఈ సమయంలో చుక్కారామయ్య గారి పేరు ఐఐటి రామయ్యగారు అనే స్థిరపడింది. రామయ్యగారు ఐఐటిని స్థాపిం చలేదు.కనీసం ఏ ఐఐటిలోనూ ప్రొఫెసర్‌గా బోధన కూడా చేయ లేదు. అయినా ఆయనను ఐటటి రామయ్యగారు అనే అంటు న్నాం. దేశం మొత్తంలో ఐఐటి ఇంటి పేరైన దృష్టాంతం మరొకటి లేదు. దేశంలోనేకాదు, దేశం వెలుపలి సైతం ఎక్కడెక్కడ తెలుగు వారు ఉన్నారో, ఎక్కడెక్కడ ఇండియా ఐఐటిలలో ప్రవేశం గురించిన ప్రస్తావనలు వస్తుంటాయో, అక్కడల్లా రామయ్యగారి పేరు వినిపిస్తుంది. ఇందులో ఎంతమాత్రం అతిశయోక్తిలేదు.

ఇంటర్నెట్‌ తెరచి,ఐఐటి రామయ్య అనే అక్షరాలను గూర్చి ‘సెర్చ్‌ చేయండి. కొన్ని వందల సైట్లు మీముందు ప్రత్యక్షమవ్ఞతుంటాయి. ‘చుక్కా రామయ్య అని సెర్చి చేసినా చాలా సైట్లు వస్తాయి. గూగుల్‌ మీకు హైదరాబాద్‌ విద్యానగరంలో ఆయనకున్న చిన్నప్లాటు చిరునా మాను మ్యాపులో చూపుతుంది. ఇంటికి వెళ్లిచూస్తే ఇంత పెద్ద పేరున్న రామయ్యగారు ఇంత చిన్నయింట్లో వ్ఞంటున్నారా? అని ఆశ్చర్యం కలుగుతోంది కొత్తవాళ్లకు. స్వాతంత్య్ర సమయంలో పాల్గొన్నప్పుడు ఆయన సమరయోధుడు రామయ్య. తెలంగాణా సాయుధ పోరాటంలో పాత్ర వహించినప్పుడు ఆయన విప్లవకారు డు రామయ్య. మార్క్సిస్టు భావాలను ఆయన దాచుకోకుండా బయటకే చెపుతుంటారు గనుక ఆయన మార్క్సిస్టు రామయ్య. ఉపాధ్యాయ సంఘాలను స్థాపించి, అవి విస్తరించడానికి కృషి చేసి నప్పుడాయన సంఘంరామయ్య.ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పుడు ఆయ న ఎమ్మెల్సీరామయ్య.

ఎప్పుడెవరు ఎలా పిలిస్తేనేమిగాని ఇప్పుడు ఆయనను ప్రజలు ఐఐటి రామయ్యగారనే అంటున్నారు. రామయ్యగారు చదువ్ఞకొంటు న్నప్పుడు, స్వాతంత్య్రోద్యమ కాలంలో జైలుజీవితం గడుపు తున్నప్పుడు, ఉపాధ్యాయుడుగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ప్పుడు, ఉపాధ్యాయసంఘా లను నిర్మిస్తున్నప్పుడు, ఐఐటి ప్రవేశ శిక్షణ నిర్వహిస్తున్న ప్పుడు ఆయనకు ఎన్నో అనుభవాలు కలిగాయి. అనుభవాల నుంచి ఆయన పాఠాలు నేర్చుకున్నారు. అవి మనకు పాఠాలు నేర్పుతాయి. ఇటీవల కాలంలో సైతం ఆయ నకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. ఒక ఉదాహరణ చాలు. ఆదాయం పన్నుశాఖ అధికారి ఒకరు తన కుమారుడికి ప్రవేశపరీక్ష పెట్టకుండా శిక్షణ తరగతిలో చేర్చుకోమని అడిగారు. అందరికీ ఒకే నియమం వర్తిస్తుందని స్పష్టం చేసి రామయ్యగారు అందుకు నిరాకరించారు. వెనువెంటనే రామయ్యగారిని అధికారి ముప్పతిప్పలు పెట్టారు.

నీతికి నిలబడినందుకు అవమానకరమైన పద్ధతిలో పోలీసు స్టేషన్‌కు పిలిపించడం కూడా చేశారు. విచిత్రమే మింటే ఆ అధికారి తన కొడుకును అటు తరువాత పరీక్షకు కూర్చోబెట్టి మళ్లీ రామయ్యగారి వద్ద శిక్షణకే పంపించారు. ఇలాంటి అనుభవాలు ఆయనకు ఎన్నో ఉన్నాయి. నిజానికి ఈ అనుభవం, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రజలను ఎలా బాధపెట్టగలరో తెలియ చేస్తున్నందున అందరికీ అదొక పాఠమే. దళిత విద్యార్థులను ఇంట్లో ఉంచుకొని చదువ్ఞ చెప్పడం, చెప్పించ డం నుంచి స్వచ్ఛంద సేవగా పేద బాలల వసతి గృహాలకు వెళ్లి పాఠాలు చెప్పడం వరకు అభ్యుదయ భావజాలంతో కూడిన ఈ మానవీయ దృక్పథమే ఉంది. అన్యాయాలను ఎదిరించే పోరాట పటిమ ఆయనకు చిన్న వయస్సులో ఎలాఉండేదో ముది మిలోను అలాగే వ్ఞంది.

తన వద్ద శిక్షణ పొంది ఐఐటి ప్రవేశ పరీక్షలో అగ్రస్థానం సంపాదించిన ఒక విద్యార్థి ఇంటర్‌ పరీక్షలో ‘ఫెయిల్‌ అయినప్పుడు ఎక్కడో పొరపాటు జరిగిందని గ్రహించి ఇంటర్‌ పరీక్షలో విద్యార్థి రాసిన సమాధాన పత్రాలను తిరిగి మూల్యాం కనం చేయించడానికి ఆయన చేసిన పోరాటం చరిత్రను నిర్మించింది. ఇదొక అపూర్వ సంఘటన. ఆయన అలా పోరాడక పోతే పేపర్లు దిద్దిన పెద్దమనిషి చేసిన పొరపాటుకు విద్యార్థి శిక్ష అనుభవించి వ్ఞండేవాడు. పేపర్లను రెండోసారి దిద్దిన తర్వాత రామయ్యగారు అనుకొన్నట్లే ఆ విద్యార్థికి మంచి మార్కులు వచ్చి ఉత్తీర్ణుడైనాడని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రామయ్యగారికి తన పిల్లలెంతో తనవద్ద చదువ్ఞకుంటున్న పిల్లలూ అంతే.అంతకంటే ఎక్కువేమో కూడా అనిపిస్తుంది.

సరళమైన వాక్యాల్లో శక్తివంతమైన భావాలను వ్యక్తం చేసే రామయ్యగారు ‘అంటరానితనం అనుభ వించే వారికే తెలుస్తుంది గాని ఆలోచించేవారికి దాని తీవ్రత తెలి యదు అంటారు. సామ్యవాది రామయ్యగారికి పై వాళ్లూ, పని వాళ్లు అనే భేదం లేదు . ఆయన నిగర్వి, నిత్యవిద్యార్థి, నిరాడం బర జీవి. అన్నిటికి మించి ఆయన అసదృశమేధావి. దార్శనికుడు, చదువ్ఞ మనిషి, విద్యాయోగి. రామయ్యగారికి మన సంస్కృతి పట్ల వేద సంపద పట్ల అపారమైన గౌరవం ఉంది. మన భాషపై అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆయన రచించిన ‘ఇంటి భాష పాలకులు భాష విషయంలో అ్ఞనుసరించవలసిన విధాన రచనకు ఉపయోగపడే గొప్ప గ్రంథం.
– పొత్తూరి వెంకటేశ్వరరావ్ఞ (రచయిత: ప్రముఖ పాత్రికేయులు) (ఉద్యమ జీవి చుక్కా రామయ్య జీవిత చరిత్ర ఆధారం)