సామాజిక చైతన్యంతోనే సాంకేతిక విద్య

                 సామాజిక చైతన్యంతోనే సాంకేతిక విద్య

technology
technology

మాజంలోని అసమానతలను అంతమొందించాలన్నా గ్రా మీణ ప్రజల జీవన ప్రమా ణాలు మెరుగుపరచాలన్నా, పేదరికాన్ని పారద్రోలాలన్నా, సామాజిక చైతన్యంతోకూడిన ఉన్నత విద్య అవసరం. ఇటువంటి విద్యతోనే ప్రజల జీవనప్రమాణాల్లో గుణాత్మకమైన మార్పు సాధిం చగలం. సమానత్వం పునాదిగా సామాజిక, ఆర్థిక నిర్మాణాలను ఆవిష్కరించుకునే అవకాశం సాంకేతిక విద్యవల్లే సాధ్యమవ్ఞతుంది. కాని దురదృష్టవశాత్తు వర్గాలు, కులాలు, మతాల ప్రాతిపదికలుగా, అసమానతలు
బలంగా వేళ్లూనుకొని మనదేశంలో కేవలం సాంకే తికవిద్యతో ఆర్థిక సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని సాధించ లేం. ఏవిద్య అయినా చైతన్యవంతమైన ఆలోచనలు కలుగ చేయా లి.అంటే సామాజిక, మానవీయ శాస్త్రాలు అందులో ఇమిడి ఉండా లి. కాని ప్రస్తుతం ఉన్న సాంకేతిక విద్యలో ఈ రెండు అంశాలు కనుమరుగైపోయాయి. సామాజిక స్పృహ లేకుండా, విలువలలోని ఔన్నత్యం, నైతికతలోని గొప్పతనం గురించి ఏమాత్రం అవగాహన లేకుండా కేవలం నైపుణ్యాలతో మాత్రమే సామర్థ్యం సంపాదిస్తే, ఆవ్యక్తి పరిపూర్ణుడు కాలేడు. కేవలం యంత్రంలా లేదా శిక్షణ పొందిన జంతువ్ఞలా మిగిలిపోతాడు.

ఇటువంటి యంత్రాలు కేవ లం ఐదంకెల జీతమే లక్ష్యంగా మసలుతాయి తప్ప తమ చుట్టూ ఉన్న సమాజాన్ని గురించి ఏమాత్రం ఆలోచించవ్ఞ. దేశాన్ని విడిచి పెట్టి,కార్పొరేట్‌ సంస్థలలో పనిచేయడానికి వెళ్లిపోతారు. ఈ మేధో వలసల వల్ల దేశానికి అపారమైన నష్టం చేకూరుతోంది. సామాజిక ప్రయోజనాల కోసం ఒక వస్తువ్ఞను సృష్టించడం సాంకేతిక విద్య ముఖ్య లక్ష్యం. సమాజం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి అవగా హన లేకుండా, వస్తువ్ఞలు శాస్త్రం, కళాతత్వశాస్త్రం, మావన సమా జ సంక్షేమం, నైతిక
విలువలు వృత్తి, నీతి నియమాలు తెలుసు కోకుండా ఒక మంచి సాంకేతిక నిపుణుడు కాలేడు. మానవీయ సామాజిక శాస్త్రాలను తప్పనిసరిగా అధ్యయనం చే యాలని 1961లో నియమించిన ‘నాయుడమ్మ కమిటీ సూచిం చింది. అటువంటప్పుడే సాంకేతిక వృత్తులనే మానవీయం అవ్ఞతా యని సామాజిక ఆర్థిక పురోగతిసాధ్యమవ్ఞతుంది.

సామాజిక చైతన్యం, ప్రజాస్వామిక విలువల పట్ల గౌరవం, ఆత్మవిశ్వాసం, అన్యాయాన్ని ప్రశ్నించడం వంటి లక్షణాలేవి ఈనాటి సాంకేతిక విద్యార్థిలో కానరావ్ఞ. కేవలం సాంకేతిక విద్యలో నిష్ణాతులవ్వటం వల్ల వీరిలో 85 శాతం మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. తమకుతాము పోషించుకోలేని వీరు సమాజానికి ఏరకంగానూ ఉప యోగపడరు. విలాసవంతమైన జీవితాలకి అలవాటుపడి, సం పాదన లేకపోవడం వల్ల అనేక మోసాలు, నేరాలు చేస్తూ సాంఘిక శక్తులుగా పరిణమిస్తున్నారు. ఉన్నత విద్యారంగంలో ప్రైవేటీకరణ బలోపేతమవ్ఞతున్న క్రమంలో మేధో మూలధనంగా పిలవబడుతూ సమాజ ఉన్నతీకరణకు
పునాదులువేసే కోర్సులన్నీ అదృశ్యమైపో యాయి.కేవలం ఇంజినీరింగ్‌,మెడిసిన్‌, మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సు లు మార్కెట్‌ అవసరాల బట్టి మనుగడ సాగిస్తున్నాయి.లక్షలకు లక్షలు డొనేషన్లు,ఫీజులు చెల్లించి అభ్యసించే వీరిఆలోచనలు కూడా డబ్బు చుట్టూనే తిరుగుతాయి.

విదేశాలకు వెళ్లి లక్షలు సంపాదిం చాలనే ఆలోచన తప్ప,సమాజానికి, సంబంధించినంత వరకూ వారు మృతప్రాయులే. మానవ సంబంధాలలో వాళ్లు నిర్లక్షరాస్యు లు. ఆత్మవిశ్వాసం శూన్యం. దేనిని ప్రశ్నించలేని, ఎదిరించలేని పిరికి మనస్తత్వంతో, బానిస స్వభావంతో ఎదిగే వీరి వల్ల సమా జానికే మాత్రం ఉపయోగం లేదు. ప్రభుత్వ అధికారులు, మేధా వ్ఞలు, ఉన్నత విద్యనిపుణులు కూడా కేవలం మార్కెట్లో డిమాండ్‌ ఉన్న కోర్సులకే ఓటేయడం విచారకరం. విశ్వవిద్యాలయాల్లో చరిత్ర,సామాజిక శాస్త్రం,వంటి విభాగాలు మూతపడడంతో విద్యార్థులకు మన చరిత్ర, నాగరికత, సంస్కృతి తెలుసుకునే అవకాశం ముందుముందు ఉండదు.మూలాలను మరి చిపోతే మానవీయత మృగ్యమైపోతుంది. ప్రజలకు, సమాజానికి ఏవి అవసరమో వాటినే డిమాండ్‌ లేదనే సాకుతో అంత మొందించుకుంటూపోతే మన కాళ్లనుమనమే నరుక్కునట్లవ్ఞతుంది.నైతికత అన్న భావనను వదిలి కేవలం నిబంధనలను అనుసరిస్తూ పోతే మనస్సులు లేని మృగాలుగా మిగులుతాం.

ఇక సంఘటితం కావడం, అన్యాయాన్ని ఎదుర్కొనడం అనే ప్రశ్నే ఉండదు. దీని వల్ల ప్రమాణాలు తగ్గి, శాశ్వత ఉద్యోగాలకు తిలోదకాలిచ్చి, కేవలం గంటల లెక్కన, డాలర్ల లెక్కన పనికి పెట్టుకునే రోజులొస్తాయి. సమాజాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించి చర్చించే వాళ్లు ముందు ముందు కానరారు. ఇటువంటి అంశాలను ముందు ముందు మేధా వ్ఞలే మాట్లాడాలేమో. సామాన్యులు మాట్లాడితే దేశద్రోహులంటా రు. అసలు ఆ ఊసే మనకెందుకని తల్లిదండ్రులు కూడా నిరు త్సాహపరుస్తున్నారు. ఇకకార్పొరేట్‌
కళాశాలలు/ విశ్వవిద్యాలయా ల్లో సంగతి చెప్పనవసరం లేదు. కొద్దో గొప్పో ప్రభుత్వ విశ్వ విద్యాలయాల్లోనే నాయకత్వ ధోరణిని అందిపుచ్చుకుని, తమ చుట్టూ జరుగుతున్న అన్యాయాలను చూస్తూ ఉండబట్టలేక ప్రశ్నిం చటం మొదలుపెట్టబట్టే ఈ మధ్యకాలంలో పెేరెన్నికగన్న విశ్వ విద్యాలయాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మనదేశ ఉన్నత విద్యారంగం మార్కెట్‌ విలువ 20 బిలియన్‌ డాలర్లు పైచిలుకు.

ఈ రంగాన్ని అభివృద్ధి చేయాలంటే రానున్న పది సంవత్సరాలలో మరో 20 బిలియన్‌ డాలర్లు అవసరమవ్ఞతాయి. ఇంత పెద్ద మొ త్తంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వాల వద్ద నిధులు లేవ్ఞ. అసలు విశ్వవిద్యాలయం
అంటేఅర్థం తెలియకుండా నడుస్తున్నా యి ఈనాటి ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు. సంఘటితంగా తమ భావాలను, ఆలోచనలను ఆచరణాత్మకంగా అమలు పరచడానికికావలసిన జ్ఞానాన్ని పొందే స్వేచ్ఛా ప్రదేశమే విశ్వవిద్యాలయం. తన చుట్టూ ఉన్న సంక్లిష్టమైన సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే ఆర్థిక సూత్రాలతో కూడిన చారిత్రక ఆధారాలతోకూడిన మదింపు అవసరం. భవిష్యత్‌ పరిణామాలను అంచనా వేయలంటే గొప్ప దార్శనికత అవసరం.సృజనాత్మకంగా ఆలోచించాలంటే సామాజిక, భావోద్వేగాలను చవిచూడాలి. నాయకత్వ లక్షాలు స్వతఃసిద్ధంగా ఎవ్వరికి అలవడవ్ఞ. సమాజాన్ని చదివితే నలుగురిని కలుపుకోవ డం ఎలాగో తెలుస్తుంది.అన్నివర్గాలను, కులాలను అంగీకరించడం నేర్పుతుంది. ఇటువంటి విద్యకేవలం మానవీయ, చారిత్రక సామా జిక పాఠ్యాంశాలతోనే సాధ్యం. గొప్పగొప్ప ఆవిష్కరణలన్నీ బట్టీప డితే రాలేదు.

ఏ శాస్త్రవేత్తకు నూటికి 90 మార్కులు రాలేదు. ఏ ఆవిష్కరణ పరిశోధనాశాలల్లో పురుడుపోసుకోలేదు.అవన్నీ పువ్ఞ్వ పూయడం, ఎంత సహజంగా జరుగుతుందో, అంతే సహజంగా ఆవిష్కరింపబడ్డాయి.సహజసిద్ధమైన మేధస్సుభగవంతుని కానుక. హేతుబద్ధమైన ఆలోచనలు నూతనఆవిష్కరణలకు దారితీయలేవ్ఞ. ఒక మోటారు కారు జీవన కాలంపది, పదిహేను సంవత్సరాలుం టుంది. చరవాణి, వంటి హైటెక్‌ పరికరాల జీవితకాలం రెండు మూడేళ్లుంటుంది. కృతిమ మేధస్సుతో కూడిన మరమనుషుల జీవితం ఐదారు సంవత్సరాలే. కేవలం శాస్త్రసాంకేతిక అంశాలకే ప్రాధాన్యమిచ్చి జీవితాన్ని కొనసాగిస్తే అది అనతికాలంలో ముగు స్తుందన్నది వాస్తవం. అదే మానవీయ శాస్త్రాల అభ్యాసన వల్ల, సామాజిక దృష్టికోణంలో ఆలోచనలు కొనసాగితే,స్వీయ బోధన, ఆత్మవిమర్శ, సమాజంలోని పరిణామాల స్వీకృతి వంటివి అల వడతాయి. వీటివల్ల స్వయం సిద్ధమైన నాయకుడుగా ఎదిగి తన లోని శాస్త్రీయదృక్పథాన్ని సమాజ పరిధికి విస్తరించగలుగుతాడు.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న నూతన ఆవిష్కరణలు సమాజంపై చూపెడుతున్న ప్రభావాన్ని నేటి సాంకేతికనిపుణులు అంచనావేయలేకపోతున్నారనేది సత్యం. దీనికి కారణం వీరిలో సామాజిక చైతన్యం లోపించడమే. కేవలం ఆవిష్కరణల విజయో త్సాహాన్ని ఆనందిస్తున్నారు కాని అది చూపే పెను ప్రభావాలను అంచనా వేయలేకపోతున్నారు. దీనికి ఉదాహరణే ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు.దీని నిర్మాణదారులుశుద్ధ సాంకేతిక నిపు ణులు మాత్రమే. వీరే కనుక మానవీయ, సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేసినట్లయితే దాని రూపురేఖలే మరోరకంగా ఉండేవి. కేవలంఎదుటి వారి మనోభావాలు దెబ్బతీసేటట్టు సాగుతున్నాయి ఇవి. నేటితరంలో దయ,కరుణ, సానుభూతి, సున్నితత్వం లోపి స్తున్నాయి. సున్నితత్వంతో మనుషులు మంచి వాళ్లుగా మారుతా రు. తద్వారా మానవీయ ఆవిష్కరణలు సాధ్యపడతాయి.
– ఈదర శ్రీనివాసరెడ్డి (రచయిత:ప్రిన్సిపాల్‌ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం)