సానుభూతి కోసం ‘కత్తి’ డ్రామాలు

p sunita
p sunita

పశ్చిమ గోదావరి: విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడిని మంత్రి పరిటాల సునీత భూటకపు చర్యగా అభివర్ణించారు. జగనే కావాలని సానుభూతి కోసం కత్తితో పొడిపించుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై అనవసరంగా గొడవలు చేసి ప్రభుత్వాన్ని, సియం విఫలమయ్యారని నేరం మోపండం సరికాదన్నారు. ప్రజల కళ్లు గప్పి డ్రామాలాడాలంటే ఎవరూ నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. వైఎస్‌ సియంగా ఉన్నపుడు పరిటాల రవిని పట్టపగలే చంపించారన్నారు. అప్పుడు మా కుటుంబానికి అండగా చంద్రబాబు ఒక్కరే ఉన్నారని గుర్తు చేసుకున్నారు.