సాగ‌ర్ గేట్ల ఎత్తివేత‌

Nagarjuna sagar
Nagarjuna sagar

న‌ల్ల‌గొండః: ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జునసాగర్‌ జలాశయం నిండు కుండను తలపిస్తోంది. నాలుగేళ్ల తర్వాత ఈ ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జలాశయంలో నీరు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువగా రావడంతో అధికారులు రెండు గేట్లు 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 14వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న టెయిల్‌పాండ్‌కు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 595 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 586 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 300 టీఎంసీల నీరు నిల్వ ఉంది.