సాకర్‌ విస్తరణే లక్ష్యం

INFANTING1
INFANTING1

సాకర్‌ విస్తరణే లక్ష్యం

రెండు లాభదాయక టోర్నమెంట్లను నిర్వహించేందుకు తద్వారా 25 బిలియన్ల డాలర్ల ఆదాయం సమపార్జించేందుకు ఫిఫా రంగం సిద్ధం చేస్తోంది. ఆ దిశగా వివిధ దేశాల, ప్రాంతాల, ఖండాల ఫుట్‌బాల్‌ సంస్థలు, సంఘాలతో ఇటీవల వరుసగా సంప్రదింపులు జరుపుతోంది. వివిధ వ్యక్తిగత ఫుట్‌బాల్‌ సంఘా లు, క్లబ్‌ల యాజమాన్యాలతో చర్చిస్తోంది.

తద్వా రా క్లబ్‌ వరల్డ్‌ కప్‌, నేషన్స్‌ లీగ్‌ వంటి టోర్న మెంట్లను పూర్తిగా పునర్వ్యవస్థీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ దిశగా ఆయా టోర్నమెంట్ల పునర్వయవస్థీకరించేందుకు అవసర మైన అనుమతి తీసుకునేందుకు ఫిఫా పాలక మం డలి ప్రత్యేకంగా సమావేశం కానున్నది. వివిధ రకాల టోర్నీల నిర్వహణకు పుష్కల అవకాశాలు… ఫిఫా అంతర్జాతీయంగా వివిధ రకాల సాకర్‌ టోర్నమెంట్ల నిర్వహణకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది. ఈ దిశగా వచ్చేనెల రెండో వారంలో జ్యురిష్‌లో ఫిఫా పాలక మండలి అసాధారణ రీతిలో సమావేశం కాబోతున్నది. యూరప్‌ సభ్య దేశాలకు చెందిన ప్రముఖ ఫుట్‌ బాల్‌ క్లబ్‌లు మ్యాచ్‌లను కుదించేందుకు ప్రణాళి కలు సిద్ధం చేస్తున్నాయి. తమ ఆటగాళ్లకు తగినం త విశ్రాంతి కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తున్నా యి.

కాన్ఫిడరేషన్ల టోర్నమెంట్లను క్రమబద్ధీకరిం చాలని చూస్తోంది. ఫిఫా అధికారులు తమ ప్రతిపాదనల పట్ల సానుకూల వాతావరణం నెలకొంటుందని అభిప్రాయపడుతున్నారు. అన్ని వైపులా సానుకూల అభిప్రాయం ఉంటుందని చెబుతున్నాయి. 48జట్లకు సాకర్‌ కప్‌ విస్తరణే ఫిఫా లక్ష్యం… ఫిఫా వార్షిక సదస్సుకు హాజరైన ప్రతినిధులు 2022లో జరిగే సాకర్‌ కప్‌ టోర్నమెంట్‌ 48 జట్లకు విస్తరించేందుకు వీలు ఉన్నది. గతేడాది జరిగిన ఫిపా సమావేశంలో ‘సాకర్‌ కప్‌లో 32 జట్లకు అనుమతించాలని నిర్ణయించింది. ఖతార్‌ 2022 ‘సాకర్‌ కప్‌ నిర్వహణకు ఆతిథ్యం ఇవ్వ నున్న సంగతి తెలిసిందే. అయితే 2022 సాకర్‌ నిర్వహణ ఆతిథ్య హక్కులు గెలుచుకున్న నాటి నుంచి ఖతార్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖతార్‌లో జరిగే సాకర్‌ టోర్నమెంట్‌లో ప్రయోగాత్మకంగా 16 జట్లకు చోటు కల్పిస్తే లభించే ప్రయోజనాలు, సాధకబాధకాలను ఫిఫా అంచనా వేయనుంది.

సాకర్‌కప్‌కు తోడుగా పొరుగు దేశాల్లో అనుబంధ టోర్నీలు…. సాకర్‌ కప్‌ నిర్వహణకు తోడుగా పొరుగు దేశాలు కొన్ని టోర్నీలు నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. 48 జట్లతో సాకర్‌ కప్‌ నిర్వహించడం సమస్యే కాదని ఖతార్‌ తేల్చేసింది. ఈ ప్రతిపాదనపై ఈనెల ప్రారంభంలో సౌత్‌ అమెరికా ఫుట్‌బాల్‌ అసోసియేషన్లు, నిర్వాహకులు లేవనెత్తినప్పుడు ఖతార్‌ వెల్లడించిన అభిప్రాయం ఇది. విజయవంతంగా 2022 ప్రపంచకప్‌ నిర్వహిస్తామని ఖతార్‌ మరోసారి హామీ ఇచ్చింది. రెండు టోర్నమెంట్ల నిర్వహణకు ఫిఫా ప్రణాళికలు… ఫిఫా నాయకత్వం కూడా ఇప్పటివరకు రెండు టోర్నమెంట్ల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. క్లబ్‌ ప్రపంచకప్‌ను విస్తరించి, సంస్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కాన్ఫిడరేషన్స్‌ కప్‌ రద్దు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది ఫిఫా. కాన్ఫిడరేషన్స్‌ కప్‌ స్థానంలో సాకర్‌ కప్‌ నిర్వహించడానికి ఏడాది ముందు అదే దేశం ‘నేషన్స్‌ లీగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది.

ప్రస్తుత టోర్నమెంట్ల నిర్వహణపై అనిశ్చిత్తి…. ఫిఫా క్లబ్‌ ప్రపంచకప్‌, ఫిఫా కాన్ఫిడరేషన్స్‌ కప్‌ కొనసాగుతాయా…?లేదా..? అన్న విషయం స్పష్టత కాన రాలేదు. ప్రతి ఏటా డిసెంబర్‌ నెల లో ఏడు క్లబ్‌లతో క్లబ్‌ వరల్డ్‌ క్లబ్‌ నిర్వహిస్తున్న ఫిఫా…దాన్ని విస్తరించాలని…అది జూన్‌కు బదిలీ చేయాలని సంకల్పించింది. అంతేకాదు నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించాలని ప్రతిపాదించనున్నది. 24 టీమ్‌లతో గ్రూప్‌కు ఎనిమిది జట్ల చొప్పున మూడు గ్రూపులుగా విభజించాలని ప్రతిపాధిం చింది. క్లబ్‌ ప్రపంచ క్లబ్‌ ఫైనల్స్‌లో అడుగు పెట్టా లంటే ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొందాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 2021,2025,2029, 2033ల్లో క్లబ్‌ ఫిఫాప్రపంచకప్‌ నిర్వహించాలనిఫిఫా ప్రణాళి కలు రూపొందించింది. ఒక టోర్నమెంట్‌ ద్వారా సుమారు మూడు బిలియన్ల డాలర్ల ఆదాయం సముపార్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నది ఫిఫా. ఇలా నేషన్స్‌ లీగ్‌ నిర్వహణకు ఫిఫా ప్రణాళికా….నేషన్స్‌ లీగ్‌ నిర్వహణకు రంగం సిద్ధం చేసింది ఫిపా….యూరోపియన్‌ యూనియన్‌ గర్నింగ్‌ బాడీ’యెఫా),నార్త్‌ అమెరికా, సెంట్రల్‌, కరేబియన్‌ దేశాల కాన్ఫిడరేషన్‌) కాంకాకాప్‌ స్థానే సొంతంగా నేషన్స్‌ లీగ్‌ నిర్వహించాలని ప్రతిపాదించింది. ఫిఫా. దీనికి ఆమోదం తెలిపితే ఫిఫా ‘నేషన్స్‌ కప్‌ నిర్వహణకు 100 కోట్ల డాలర్ల హక్కులు లభి స్తాయని అంచనా వేసింది. 2033లో నాలుగో ఎడిషన్‌ నేషన్స్‌ లీగ్‌ నిర్వహించే నాటికి దీని ద్వా రా నాలుగు బిలియన్ల డాలర్ల ఆదాయం లభిస్తుం దని అంచనా.

కొలంబియాలో జరిగిన ఫిఫా కౌన్సి ల్‌ సమావేశంలో అధ్యక్షుడు గియాన్నీ ఇన్‌ ఫాంటి నో తెలిపిన వివరాల ప్రకారం నూతన టోర్నమెం ట్లకు ఊపిరి పోస్తే ఆసియా, యూరప్‌, నార్త్‌ అమెరికా దేశాల నుంచి 25 బిలియన్ల డాలర్ల ఆదా యం లభిస్తుందని ఇన్వెస్టర్లు హామీ ఇచ్చాయన్నారు. రెండు టోర్నమెంట్లతో 25 బిలియన్ల డాలర్ల ఆదాయం ఫిఫా లక్ష్యం…. నేషన్స్‌ లీగ్‌ నిర్వహణతో 13 బిలియన్లు, క్లబ్‌ ప్రపంచకప్‌ నిర్వహణతో 12 బిలియన్ల డాలర్ల ఆదాయం లభిస్తుందని ఫిఫా అంచనా వేసింది. టోర్నమెంట్ల హక్కులను వాణిజ్యమయం చేయ డానికి నూతన కంపెనీని ఏర్పాటు చేయాలని ఫిఫా సంకల్పించింది. ఆ ఆదాయాన్ని నిర్వాహక సంస్థలకు కేటాయించడమే లక్ష్యంగా ఫిఫా పెట్టు కున్నది. క్లబ్‌ ప్రపంచకప్‌ నిర్వహణకు నూతన ఫార్మాట్‌ రూపొందిస్తున్నది ఫిఫా. 18 రోజుల పాటు 31 మ్యాచ్‌లు జరుగుతాయి.