సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తాం

 

MODI OUTER
మైసూరు: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామని ప్రధాని మోడీ అన్నారు. ఆదివారం మైసూరులో నిర్వహించిఆన 103వ ఇండియన్‌ సైన్స్‌కాంగ్రెస్‌ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, ఆర్తిక అభివృద్ది , సాధికారత, ఉపాధి అవకాశాల మెరుగులో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని వివరించారు. విజ్ఞానరంగ లక్ష్యం కేవలం పరిశోధనలలేకా దు, శాస్త్రీయ పరిశోధన రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చి మెరుగైన సేవలు అందిస్తామన్నారు. 20130 నాటికి పేదరిక నిరూల్మన, అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలవడమే లక్ష్యమని మోడీ అన్నారు. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు.