సాంకేతికంలో ఎపి నెం: 1

Bill Gates with Chandra babu
Bill Gates with Chandra babu

సాంకేతికంలో ఎపి నెం: 1

సేద్యానికి సాంకేతికత జోడిస్తే అద్భుతాలు
సవాళ్లను నూతన ఆవిష్కరణలతో ఎదుర్కోవాలి
ఎపి అగ్రిటెక్‌ ముగింపు సదస్సులో మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు
సాంకేతికతతో సమగ్రాభివృద్ధి సాధిస్తాం,
పౌష్టికాహారం, ఆరోగ్య అంశాలకే ప్రాధాన్యత: సిఎం చంద్రబాబు

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వ్యవసాయ రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే విషయంలో దేశంలోనే మొదటి స్ధానంలో ఉందని బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌, ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్ధ మైక్రోసాఫ్ట్‌ సంస్ధ వ్యవస్ధాపకలు బిల్‌గేట్స్‌ కితాబినిచ్చారు. విశాఖ నగరంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఏపీ అగ్రిటెక్‌-2017 ముగింపు సదస్సు లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బిల్‌ గేట్స్‌ మాట్లాడుతూ డిజిటల్‌ టెక్నాలజీ వినియోగించుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి ముందున్నారన్నారు. భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువశాతం మంది వ్యవసాయంపైనే అధారపడి ఉన్నారన్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున సాగుభూమి అందుబాటులో ఉందన్నారు. తద్వారా ఎక్కువ ఉత్పాదన చేసుకోవచ్చన్నారు. వరి సాగులో ఎక్కువ ఉత్పాదన రావాల్సి ఉందన్నారు.

మలేషియా, థా§్‌ుల్యాండ్‌ దేశాలలో ఎక్కువ ఉత్పాదన సాధ్యపడుతోంద న్నారు. చైనా, సౌత్‌కొరియా, జపాన్‌ తదితర దేశాలు ఈ రంగం అభివృద్ధిలో ముందున్నాయన్నారు. ప్రస్తుతం భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అగ్ర భాగాన ఉందన్నారు. భూసార పరీక్షలు చేసి పంటలు వేయా లన్నారు. నాణ్యమైన విత్తనాల వినియోగించడం వ్యవసాయ రం గంలో చాలా కీలకమని, ఈ విధంగా నాణ్యమైన విత్తనాలు విని యోగించడానికి సీడ్‌ పార్కు ఏర్పాటు రాష్ట్రంలో చేయడం శుభప రిణామమన్నారు

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాల్సి ఉందన్నారు. తక్కువ ధరకు విత్తనాలు ఇవ్వాలన్నారు. సీడ్‌ పార్కు వృద్ది చేసుకోవాల్సి ఉందన్నారు. సామాజిక అభివృద్ది జరగాల న్నారు. ఈ సాంకేతితను వ్యవసాయంలోనూ జొప్పించాలన్నారు. భూసార పరిస్ధితులను అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.

పెరు గుతున్న జనాభా, పోషకాహార లోపాలు, వాతావరణ మార్పులు ప్రస్తుతం భారత్‌ ఆర్ధిక ప్రగతికి పెను సవాళ్లన్నారు. రైతులు వీటిని తట్టుకునే వ్యవస్దలు రూపొందాలన్నారు. వ్యవసాయ క్షేత్రాలలో ఉత్పాదకత పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగించాలన్నారు. ఏపీ సిఎం ఈ దిశగా ఆలోచన చేయటం శుభపరిణామమన్నారు. ప్రసుత్తం సాంకేతిక అనుసంధానంకు మంచి కృషి జరుగుతుందన్నారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు రావాలి.

భారత్‌తో పాటు పలు దేశాలలో ఆహారపు అలవాట్లు మారుతున్నాయన్నారు. మారుతున్న ఆహారపు అల వాట్లకు అనుగుణంగా సాగు అలవాట్లు, పంటలు మార్పు చెం దాలన్నారు. ఈ విషయంలో ఏపీతో కలిసి పనిచేస్తామన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు: సిఎం చంద్రబాబు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వ్యవసాయం, పౌష్టికాహారం, ఆరోగ్య అంశాలలో బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ పూర్తి స్ధాయిలో సహకరించాలని కోరారు. అమెరికాలోని ఆయోవా యూనివర్శిటీ సహకారంతో అతి పెద్ద విత్తన భాండాగారం ఏర్పాటు చేస్తున్నామన్నారు. మారు తున్న ఆహారపు అలవాట్లకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వ్యవసాయం నుంచి ఉద్యానవన పంటలు, ఆక్వాకల్చర్‌, పాడి పెంపుదల వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఆధునిక విధానాల ద్వారా రైతులకు నీరు, పోషకాలను, ఎరువులను విని యోగించేలా శిక్షణ అందిస్తున్నామన్నారు.

ఈ సదస్సులో 259 కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు వచ్చాయన్నారు. 61 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. పోషకాహార లోపంతో పాటు మరిన్ని విషయాలలో సహకారం కోరుతున్నామన్నారు. వైద్య రంగంలో కూడా సహకారం అందించాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు ఏర్పాటు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా కార్యక్ర మాలు నిర్వహిస్తున్నామన్నారు.

బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా ఏపీను రూపొందిస్తామన్నారు. ఈమేరకు తానే చైర్మన్‌గా ఒక కమిటీ వేస్తున్నామన్నారు. ఈ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా బిల్‌గేట్స్‌ వ్యవహరించాలని కోరారు. వ్యవసాయ రంగంలో అనేక సవాళ్ళు వున్నాయని సన్నకారు, మధ్యతరహా రైతులే ఎక్కువగా ఉన్నారని, వీరితో పాటు కౌలు రైతులు కూడా వున్నారని వీరిని దృష్టిలో ఉంచుకొని ఒకవైపు టెక్నాలజీ, మరో వైపు వ్యవసాయం రెండూ సమాంతరంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నామన్నారు.

దేశంలో వ్యవసాయ రంగంలో అమలుచేస్తున్న ఉత్తమ పద్దతులన్నింటిని సమీకరించి రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు. ప్రజారోగ్యమే ధ్యేయంగా పని చేస్తూ, వ్యవసాయంలో సేంద్రీయ పద్దతులను అవలంభిస్తున్నామని అన్నారు. వ్యవసాయనిక దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లడం వల్ల సుస్థిర వ్యవసాయంతో పాటు లాభదాయకంగా మారుతుందని అన్నారు.

గతంలో ఐటికి ప్రాధాన్యత నివ్వడంతో ఐటి రంగంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచిందని, ప్రస్తుతం వ్యవసాయానికి ప్రాధాన్యత నిస్తూ సాంకేతిక పహకారంతో దేశానికే ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తున్నామని మూడు రోజుల సదస్సులో శాస్త్రవేత్తలు, పరిశోధకులు వివరించిన ఆధునిక పద్ధతులను తెలుసుకొని రాష్ట్రంలో వాటిని అమలుచేయడం జరుగు తుం దన్నారు. ఈ సదస్సులో రాష్ట్ర శాసనసభా స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, ఐటి శాఖా మంత్రి నారా లోకేష్‌, వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్‌ రెడ్డి సహా పలువరు మంత్రులు, పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.