సహనం

SHIRDI SAI
SHIRDI SAI

సహనం

సాయిబాబా తెల్పిన మొదటిపదం శ్రద్ధ. రెండోపదం సబూరీ. సబూరీ అనేమాట అరబిక్‌ భాషలోనిది సూఫే సాంప్రదాయంలో సబూరీని 5వ మజిలీగా భావిస్తారు. స్థూలంగా చెప్పాలంటే సబూరీ అంటే ధైర్యంతో కూడిన ‘సహనం సద్గుణాలకుగని అంటారు సాయిబాబా రాధాబాయి దేశముఖ్‌తో. సద్గుణం శోభించాలంటే సహనంతో కూడిన జారు అవసరం.

సత్కర్మ నిర్వహించాలంటే ఒకానొక సమయంలో సహనం తప్పనిసరి అవ్ఞతుంది. చిరుతోండనం బి వీరశైవ్ఞడు. ఇంకా ఆయన భార్య అయిదు ఏండ్లలోపు ఉన్న ఏకైక కుమారుడు కూడా శివదీక్షాపరులే. చిరుతోండనంబి ప్రతిదినం ఒక శివభక్తునికి శ్రద్ధతో భోజన సత్కారాలు చేసేవారు. ఇది ఆయన తన విధిగా భావించేవాడు. ఒక రోజున భైరవజంగం భోజనాలకు వచ్చాడు చిరుతోండని ఇంటికి. ఆ అతిధి మాంసం భోజనం కావాలి అన్నాడు. ‘నావద్ద మూడురకాల పశువ్ఞలు న్నాయి. ఏ పశువ్ఞ మాంసం కావాలి? ప్రశ్నిం చాడు చిరుతొండడు. ‘అయిదేండ్లలో బాలుని మాంసం అన్నాడు అతిధి. అటువంటి కోరినందుకు తప్పుపట్టలేదు. ఆ దంపతులు తమకున్న ఒక్కగానొక్క కుమారుని వధించి మాంసం ఇవ్వలేం అని పలుకలేదు. ఏంచేద్దామని కూడా ఆ దంపతులు ఆలోచించుకోలేదు.

అతిధి సేవపై ఉన్న శ్రద్ధ అటువంటిది. ఆ అతిధి సేవ చేయటానికై వెనుకాడ లేదు వారు. కన్నకు మారుని వధించారు. కన్నీరు కారలేదు ఆ దంపతుల కండ్ల నుండి. అతిథి కోరిక తీరుస్తున్నామనే ఆనందం కలిగింది. ఆ మాంసాన్ని వడ్డించాడు విస్తరిలో అతిథికి. ఆ అతిధి ఆ మాంసాన్ని చూచాడు. వారిని కూడా చూచారు. ‘మీ బాలుడిని కూడా పిలు భోజనానికి అన్నాడు ఆ భైరవజంగం. ‘ఆ బాలుడు ఇప్పుడు రాలేడు అని వినయంగా పలికారు. ఆ పలుకులలో నిష్ఠూరం లేదు, బాధలేదు. ‘కాదు, వెళ్లి పిలవండి అన్నాడు ఆ అతిధి. ఆ బాలుని పేరు సిరిమాళుడు. ‘సిరిమాళుడా అని పిలిచాడు ఆ దంపతులు. సిరియాళుడు బయట నుండి వచ్చాడు. సిరియాళునితో అతిధి వద్దకుపోగా, అతిధి లేడు, మాంసమూ లేదు. ఉమాసహి తుడైన శివ్ఞడు కుమారస్వామితో ప్రత్యక్షమయ్యాడు. వారు ఆ చిరుతోండనంచిని, ఆయన భార్యను, కుమారుని శివలోకానికి తీసుకుపోయారు. సహనానికి హద్దు ఉండదు.

– యం.పి.సాయినాధ్‌